ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మూవీగా బాహుబలి పేరు యావత్ ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. బాహుబలి మూవీకి ఎటువంటి పబ్లిసిటి అయితే రాజమౌళి కోరుకున్నాడో, దానికి కంటూ ఊహించని విధంగా ఇప్పుడు బాహుబలి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది.


అయితే హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ధీటుగా ఇండియన్ ఫిల్మ్ బాహుబలి సత్తా చాటబోతుందంటూ హీలీవుడ్ మార్కెట్ లో టాక్స్ వస్తున్నాయి. దీంతో హాలీవుడ్ క్రిటిక్స్ ఈ స్టేట్మెంట్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ బాహుబలి విజువల్స్, థియోట్రికల్ ట్రైలర్, మేకింగ్ వంటి విజువల్స్ ని చూసి, బాహుబలి పక్కా హాలీవుడ్ సీన్స్ నుండి కాపీ కొట్టిన చిత్రం అంటూ లేక్క తేల్చారు.


బాహుబలిని హాలీవుడ్ రేంజ్ విజువల్ గ్రాఫికల్ మూవీ అని పోల్చాల్సిన అవసరం లేదు. బాహుబలి ఇండియన్ పూర్ బడ్జెట్ సినిమా అంటూ ఓ హాలీవుడ్ క్రిటిక్ నెట్ లో కామెంట్ పోస్ట్ చయటంతో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న బాహుబలి మూవీపై, ఇలా వరుసపెట్టి నెగిటివ్ కామెంట్స్ రావడం అనేది చాలా సహజం అంటూ చిత్ర యూనిట్ లైట్ తీసుకుంటుంది.


ఇదిలా ఉంటే రాజమౌళి ఇప్పటికే బాహుబలి మూవీకి ఇండియా వైడ్ గా పబ్లిసిటిని క్రియేట్ చేశాడు. జులై 10న ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటూ ఇండియన్ బాక్సాపీస్ వర్గాలు సైతం లెక్కలు వేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: