నిన్న ఆదివారం నెల్లూరులో చిరంజీవి యువత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు ఈ సమావేశంలో చెప్పిన మాటలు మెగా అభిమానులకు పండుగగా మారింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు మరియు షష్టిపూర్తి వేడుకలు అత్యంత భారీగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నామని ఈ వేడుకలకు వేలాది సంఖ్యలో ఇరు రాష్ట్రాల నుండి మెగా అభిమానులు రాబోతున్నట్లు స్వామినాయుడు ప్రకటించాడు.

ఇదే సందర్భంలో ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కూడ వస్తున్నట్లుగా తనకు మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా తెలిపాడు అని చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ స్వామినాయుడు మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

చిరంజీవి నటించబోయే 150వ సినిమా పేరు అందరూ అనుకుంటున్నట్లుగా ‘ఆటోజాని’ కాదని ఇది కేవలం అభిమానులు సృష్టించుకున్న టైటిల్ మాత్రమే అని చెప్పడంతో పూరీ చిరంజీవిల సినిమా ఇక పూర్తిగా అటక ఎక్కినట్లే అన్న సంకేతాన్ని స్వామినాయుడు మెగా అభిమానులకు లీక్ చేసాడు అనుకోవాలి.

చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా చిరంజీవి నటించిన సినిమాల వారోత్సవాలను చిరంజీవి పుట్టినరోజు నుండి ప్రారంభించడమే కాకుండా ఇరు రాష్ట్రాలలోని ప్రముఖ పట్టణాలలోను అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా స్వామినాయుడు ప్రకటించడంతో మెగా షష్టిపూర్తి వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: