తెలుగు ఇండస్ట్రీలో మెగా వారుసులకు మంచి ఇమేజ్ ఉంది. చిరంజీవి వారసత్వంతగా సినీ రంగ ప్రవేశం చేసినా వారికంటే సపరేట్ ట్రెండ్ సృష్టించుకున్నారు. చిరు తమ్ముడు పవన్ కళ్యాన్, తనయుడు రాంచరణ్, అళ్లుల్లు అల్లు అర్జున్, ఈ మద్య వచ్చిన సాయిధర్మతేజ్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇలా చిరు వారసత్వంగా వచ్చిన వారే... తాజాగా ముచ్చటగా మూడవ సారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.


శ్రుతి హాసన్, అల్లు అర్జున్


'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.  అయితే తన పురస్కారాన్ని  ఇండియన్ సినిమా లెజెండ్ అక్కినేనికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.  బ్రిటానియా 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బన్నీ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా చెప్పుకోవచ్చు. గతంలో బన్నీ నటించిన ‘పరుగు, వేదం’ సినిమాలకు కూడా ఉత్తమ నటుడి అవార్డు పొందాడు.  'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది.


రేసు గుర్రం సినిమా పోస్టర్


ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'మనం'కు 5 అవార్డులు దక్కాయి.ఈ అవార్డు రావడం పట్ట బన్నీ ఆనందం వ్యక్తం చేస్తూ….తన అవార్డుని ఇండియన్ సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితమిస్తున్నానని తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: