ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ‘బాహుబలి’ చిత్రం జూలై 10వ తేదీన విడుదల కాబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో అదే రోజు మరో విశేష కార్యక్రమం జరుగు బోతుంది. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. అది మరేదో కాదు.. మహేష్ హీరోగా రూపొందనున్న 'బ్రహ్మోత్సవం' అవును ‘బాహుబలి’ విడుదల రోజే బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే మహేష్ బాబు ‘బాహుబలి’ కోసం తన సినిమా శ్రీమంతుడు జూలై 17 న రిలీజ్ కావాల్సి ఉన్నా అది పోస్ట్ పోన్ చేసుకున్నాడు.


మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం లోగో 


శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాత బ్రహ్మోత్సవం చిత్రాన్ని భారీ సన్నాహాలతో మొదలు పెట్టబోతున్నట్లు తెలియవస్తుంది. అదే రోజు ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. రెండు పెద్ద సినిమాల ఒకే రోజు అనడంతో సోషల్ మీడియాలో ఈ వార్తల గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ‘బ్రహ్మోత్సవం' సినిమా గురించైతే మహేష్ బాబు తొలిసారిగా ముగ్గురు పెద్ద హీరోయిన్లతో నటించబోతున్నాడు ఆ హీరోయిన్లు కాజల్‌, సమంత, ప్రణీత దీంతో సినిమా ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో అని అప్పుడే అభిమనులు చిత్రంపై ఎన్నో అంచనాలు వేసుకున్నారు. 


ప్రభాస్ ‘శివుడు’ బాహుబలి చిత్రం



మరింత సమాచారం తెలుసుకోండి: