ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటెం హీరోల డిమాండ్ కొంత మేర తగ్గిపోయిందనే చెప్పాలి. ముమైత్ ఖాన్ హావా తగ్గిన తరువాత, అంతటి స్థాయిలో పేరు సంపాదించుకున్న ఐటెం గర్ల్ ఇంకా ఇండస్ట్రీలో రాలేదు. అయితే తాజాగా పూరీ జగన్నాధ్ మూవీ టెంపర్ లో జూనియర్ ఆడి చిందులేసిన ఐటెం బ్యూటీ నోరా ఫతేహి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హాట్ మూవీ చేయనుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మొరాకో నుండి దిగుమతి అయిన సూపర్ మోడల్ నోరా ఫతేహీకి రెడ్ కార్పెట్ పరిచింది టాలీవుడ్. ఇప్పటికే హిందీలో ‘రోర్’, ‘ క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’, ‘మిస్టర్ ఎక్స్’ చిత్రాల్లో నటించిన నోరా ‘టెంపర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమ్మడి హిప్ మూమెంట్స్ మన వాళ్ళను సైతం మెస్మరైజ్ చేసినట్టున్నాయి, అంతే రవితేజ సినిమాతో పాటు ‘బాహుబలి’లోనూ ఛాన్స్ దక్కించుకుంది నోరా ఫతేహీ.’

టెంపర్’ సినిమాతో తెలుగు కుర్రకారు మదిదోచిన నోరాకు ఇప్పుడు వరుసగా బోలెడు అవకాశాలు వస్తున్నాయట. మొన్న జూనియర్ ఎన్టీయార్ తో రొమాన్స్ చేసిన ఈ పరదేశీ భామ, ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ అడల్డ్ స్టోరీలో నటించేందుకు నోరా సిద్ధంగా ఉంది. దాదాపు మూడు భాషల్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రంలో, నోరా హాట్ ఎక్స్ పోజింగ్ చేయనుంది. ఓ 15 నిముషాలు ఈ బ్యూటీ సెమీ న్యూడ్, న్యూడ్ లుక్స్ కనిపించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: