వేదం నాగయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న వేషాలు వేస్తూ అందరికి సూపరిచితుడే.. క్రిష్ దర్శకత్వంలో ‘వేదం’ సినిమాలో  సిరిసిల్ల నాగయ్యగా నటించాడు.  అంతే కాదు ఈ సినిమాతో మంచి ప్రశంసలు కూడా పొందాడు. తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు లభించినప్పటికీ ఈయన ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయింది. గుంటురు నివాసి అయిన నాగయ్య గత కొంత కాలంగా హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఈయన కొడుకు సినిమాల షూటింగ్స్ లో లైటింగ్ బాయ్ గా చేస్తాడు.

వేదం పోస్టర్


నాగయ్య ఆర్థిక పరిస్థతి బాగాలేక బిక్షాటన చేస్తున్నట్లు ఏపీహెరాల్డ్.కామ్ లో ఓ కథనం వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వేదం నాగయ్య కు లక్షరూపాయల చెక్ అందించి ఓల్డేజ్ పెన్షన్ కూడా  ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మా అసోసియేన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వేదం నాగయ్యకు అండగా ఉంటామని చెప్పారు. అంతే కాదు ప్రభుత్వం స్పందించి ఆయను ఆదుకున్నందుకు కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: