పవన్ ప్రెస్ మీట్ కు కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఆ ప్రెస్ మీట్ లో పవన్ ఏమి మాట్లాడతాడు అన్న ఆశక్తి పవన్ అభిమానులలో రోజురోజుకు పెరిగి పోతూ ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్ విషయం అధికారికంగా బయటకు వచ్చిన తరువాత ‘గబ్బర్ సింగ్-2’ టీమ్ మాత్రం షాక్ కు గురైందని టాక్. ప్రెస్ మీట్ లో రాజకీయాల ప్రస్తావన వచ్చిన తరువాత స్వతహాగా ఆవేశపరుడైన పవన్ తిరిగి వెంటనే సినిమాలలో నటించే మూడ్ లోకి వస్తాడా? లేదంటే ఈ వంకతో ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ ను మరోసారి వాయిదా వేస్తాడా? అన్న భయం ‘గబ్బర్ సింగ్ 2’ టోటల్ టీమ్ ను వెంటాడుతోంది అని టాక్.  

చాల కాలం గేప్ తీసుకుని పవన్ తన లుక్ ను పెంచుకోవడానికి వర్కవుట్లు చేస్తూ ఫిట్‌ అయ్యే పనిలో పడ్డాడు. అయితే ఇంకా పవన్‌ ఒక్కరోజు కూడా షూటింగ్‌లో పాల్గొనలేదు. మరి కొద్ది రోజుల్లో పవన్‌ జాయిన్‌ అవుతాడని చూస్తున్న ‘గబ్బర్‌ సింగ్‌ 2’ బృందానికి ఇప్పుడు పవర్‌స్టార్‌ మళ్లీ పాలిటిక్స్‌ వైపు డైవర్ట్‌ అవడంతో కంగారు పుడుతోంది. అయితే ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ పవన్ పెట్టబోతున్న ప్రెస్ మీట్ పై ఒక ఆ శక్తికర విశ్లేషణను ప్రసారం చేసింది. 

ఇప్పటి ఓటుకు నోటుకు వ్యవహారం కోర్టులో ఓ కొలిక్కి వచ్చాక, సెక్షన్ 8 అమలు అన్నది ఓ మైలురాయి దగ్గరకు వచ్చి ఆగాక ఇప్పుడు పవన్ కొత్తగా చెప్పబోయే కొత్త విషయాలు ఏమి ఉన్నాయి అంటూ పవన్ ను ఆ ఛానల్ ప్రశ్నించింది. అయితే ఇటువంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి కాబట్టి పవన్ చాల గట్టిగా హోమ్ వర్క్ చేసి ఈ ప్రెస్ మీట్ కు వస్తాడు అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. 

పవన్ ప్రచారం చేసి ఓట్లు వేయించి గెలిపించిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలోని కేంద్రానికి సంబంధించిన మహిళా మంత్రుల పై వచ్చిన అవినీతి ఆరోపణల విషయమై మీడియా పవన్ ను ప్రశ్నిస్తే మోడీ పై పవన్ ఎటువంటి కామెంట్స్ చేస్తాడు అన్న ఆ శక్తి కూడా ఉంది. ఏది ఎలా చూసుకున్నా ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా యూనిట్ ను మాత్రం పవన్ ప్రెస్ మీట్ విపరీతంగా భయపెడుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: