తెలుగు సినిమా రంగాన్ని టాప్ దర్శకుడిగా ఏలుతున్న రాజమౌళి బాలీవుడ్ సృజనాత్మక దర్శక నిర్మాతగా పేరుగాంచిన కరణ్ జోహార్ ల కలయికకు కారణం అయింది ‘బాహుబలి’ అటువంటి ఈ ప్రముఖులు ఇద్దరు కలిసి ‘బాహుబాల్’ గురించి మాట్లాడిన వీడియోను నిన్న మీడియాకు విడుదల చేసారు. ఈ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ అడిగిన అనేక ప్రశ్నలకు రాజమౌళి స్పందన చాల వైవిధ్యంగా ఉంది. 

“బాహుబలి” సినిమా తనను మంచి దర్శకుడిగా కంటే మంచినటుడిగా మార్చి వేసింది అని షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి. దీనికి కారణం గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా నిర్మాణంలో తాను ఎదుర్కున్న సమస్యలు తన కెరియర్ లో ఎప్పుడూ ఎదుర్కోలేదని అయితే ఆ టెన్షన్ ఎక్కడా బయటకు కనపడనీయకుండా ముఖానికి ప్రశాంతత అనే ముసుగు వేసుకుని జీవితంలో ఎలా నటించాలో తనకు పాఠాలు నేర్పిన సినిమా ‘బాహుబలి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి.

తాను దర్శకత్వం చేసిన సినిమాలను చూసి తానెప్పుడు సంతృప్తి పడనని ఆ సినిమాను ఇంకా బాగా తీసి ఉండవలసి ఉంది అన్న భావం తనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని కామెంట్స్ చేసాడు రాజమౌళి. ఈ సినిమా చిత్రీకరణ చివరి సమయంలో తలెత్తిన కొన్ని సమస్యలు వల్ల తన ముఖ కవళికలలో వచ్చిన మార్పును గ్రహించిన ఛాయాగ్రాహకుడు సెంధిల్ తన దగ్గరకు వచ్చి మేమంతా మిమ్మల్ని చూసి లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటున్నాo మీరు మీముఖం పై నవ్వు మాస్క్ ఇంటి దగ్గర మర్చిపోయారు అని కామెంట్ చేసేసరికి తిరిగి మళ్ళీ నటించడం మొదలు పెట్టానని ఆరోజు విషయాలను గుర్తు చేసుకున్నాడు రాజమౌళి.

తాను ఇప్పటి వరకు అగ్ర హీరోలతో సినిమాలు చేసానని అంటూ అవన్నీ విజయాన్ని సాధించడంతో అగ్రహీరోల అభిమానులు అందరూ కూడా తను తీసే సినిమాలకు నిజమైన అభిమానులుగా మారడం తన అదృష్టం అన్నాడు అన్నాడు రాజమౌళి. తన దృష్టిలో స్టార్ హీరోలు ఆయుధాలు లాంటివారని వారితో సినిమాలు తీయడం వల్ల అనుకున్న కథ ప్రేక్షకులకు తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని అందువల్లనే తాను ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమాలను తీస్తానని అసలు గుట్టును బయట పెట్టాడు రాజమౌళి..  



మరింత సమాచారం తెలుసుకోండి: