ఈ మాట వింటుంటే కాస్త ఆశ్చర్యం అనిపించినా ఇది మాత్రం వాస్తవం అండీ బాబు..! మన తెలుగు ఇండస్ట్రీకి ఈ మధ్య ఓ బాబు వచ్చాడు వచ్చీ రావడంతోనే బర్నింగ్ స్టార్ గా తనకు తానే బిరుదు ఇచ్చేసుకున్నాడు. అంతే కాదు అగ్ర హీరోలను ఇమిటేడ్ చేస్తూ హల్ చల్ సృష్టిస్తున్నాడు మరి ఆ బర్నింగ్  స్టార్ ఎవరో వేరే చెప్పనక్కర లేదు ఆయనే సంపూర్ణేష్ బాబు. విచిత్రమేమిటంటే తమిళంలో కూడా మన సంపూ టైప్ స్టార్ ఉన్నాడట. ఆయనపేరు శ్రీనివాస్. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు చేస్తే.. అభిమానులు ఆ హీరోలను మెగస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ అంటూ పిలుస్తారు కానీ మనోడికి ఆ అవసరమే రాలేదు తనకు తానే పవర్ స్టార్ అని పెట్టుకొని ఓ అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంతటి తో ఊరుకున్నాడా మనోడు ఏకంగా సూపర్ స్టార్ నే టార్గెట్ చేశాడు. 


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు


ఆ మధ్య లింగా సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయి బయ్యరు భారీగీ నష్ట పోయిన విషయం తెలిసిందే.... అంతే కాదు లింగ సినిమా బాధితుల సంఘం కూడా ఏర్పడింది. 
లింగా బాధిత సంఘ అధ్య‌క్షుడు సింగార‌వేల‌న్ నిర్మాత‌గా  ఈ ప‌వ‌ర్ స్టార్ శ్రీనివాస్ తో  ఓ సెటైరిక‌ల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు పెట్టుబడి గా లింగా ఫ్లాప్ తో నిండా మునిగిపోయిన డిస్ట్రిబ్యూట‌ర్లంతా క‌లిసి రావడం విశేషం. ఈ సినిమాకు నాన్ హీరోదాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు.ఈ ఏడాదే సినిమా విడుద‌ల చేయ‌నున్నారు నిర్మాత‌లు. మొత్తానికి ఇక్కడు సంపూ, అక్కడ శీను ప్రేక్షకులను ఏక్కడికి తీసుకెళ్తారో ముందు ముందు చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: