కమలహాసన్ తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ప్రచార కర్తగా వ్యవహరిస్తూ కొందరి నుంచి విమర్శలు ఎదుర్కోనడంతో కమల్ ఆ విమర్శలు చేసేవారి పై సెటైర్లు వేసాడు. తమిళనాడు ప్రభుత్వం జూలై ఒకటవ తేదీ నుండి ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని ఒక రూల్ పెట్టింది. 

దీనితో ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని కమల్ హాసన్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేసాడు. అయితే ఆవీడియోను చూసిన కొంతమంది కమలహాసన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. దీనికి కారణం కమల్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘పాపనాశనం’ సినిమాకు సంబంధించిన ఒక స్టిల్. ఈ సినిమాకు సంబంధించి కమల్ తన కుటుంబ సభ్యులందరినీ ఎక్కించుకుని మోపెడ్ నడిపే పోస్టర్ ఒకటి ఆమధ్య విడుదలైంది. 

దానిలో కమల్ హెల్మెట్ పెట్టుకోలేదు, దాని పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమల్ 'అది తప్పే' అంటూ క్షమాపణలు చెప్పాడు. అయితే తన పై విమర్శలు చేస్తున్న వారికి ఒక స్పెషల్ క్లాస్ ను పీకాడు కమలహాసన్. సర్కస్ లలో పైపులు పెట్టుకుని గాలిలోకి ఎగురుతూంటార, అది ఇంట్లో చేయగలమా? అని అంటూ సినిమాల్లో భధ్రత మధ్యే మేము నటిస్తున్నాం. ఈ విషయాలు మీవరకు రావుకదా అంటూ చురకలు అంటించాడు. 

అంతేకాదు సినిమాలలో సూపర్ మ్యాన్ చేసినవన్నీ మనం బయట జీవితంలో చేయగలమా? అంటూ కమల్ తన విమర్శకులకు క్లాస్ తీసుకోవడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: