తెలుగు చలన చిత్ర సీమలో నందమూరి కుర్రాడు యంగ్ టైగర్ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఈ మధ్య పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో పక్కా మాస్ లుక్ లో కనిపించాడు  కరప్షన్ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా ఎన్టీఆర్ చేసిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. ఈ సంవత్సరపు సూపర్ డూపర్ చిత్రాల్లో టెంపర్ ఒకటి... ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


ఈ సినిమా గురించి ప్రస్తావించి ఇప్పటికే మూడు నెలలు దాటినా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం పూర్తయ్యాయి. సుకుమార్ కు లండన్ ఫెవరెట్ ప్రేస్ అని మహేష్ బాబుతో నేనొక్కడినే సినిమా కూడా లండన్ లోనే మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా లండన్ లో షూటింగ్ మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నాడు ఈ షూటింగ్ జూలై 6వ తేదీ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. నెలాఖరులోగా ఈ చిత్ర టీం మొత్తం లండన్ చేరుకోనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో మొదటగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఎన్.టి.ఆర్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తారు.


 పీటర్ హెయిన్స్ , ఎన్టీఆర్


జూలై 6 నుంచి మొదలయ్యే షెడ్యూల్ ని కంటిన్యూగా సెప్టెంబర్ 15 వరకూ చేయడానికి ప్లాన్ చేసారు. అలాగే 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ చిత్ర వర్గాలు తెలిపారు.ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: