ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ స్టార్ డంని సంపాదించుకున్న తరువాత, తిరిగి నార్మన్ స్టార్ గా మారిన హీరోయిన్ అంజలి.  వ్యక్తిగత వ్యవహారాలతోనూ, గొడవలతోనూ అంజలి ఫిల్మ్ కెరీర్ బి గ్రేట్ లిస్ట్ లోకి వెళ్ళింది. అయితే అంజలి తెలివిగా తన ఫిల్మ్ కెరీర్ ని తిరిగి ఫాంలోకి తెచ్చుకోవటానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది.

ఆ విధంగానే తాజాగా అంజలి సెలక్ట్ చేసుకున్న మూవీలు అన్నీ కథాబలం ఉన్న మూవీలే కావడంతో, తనకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందనే నమ్మకంలో ఉంది. ఇదిలా ఉంటే తను రీసెంట్ గా ఓ మూడు మూవీలకి ఒకేసారి ప్యాకేజ్ మాట్లాడుకొని రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఆ ప్యాకేజ్ ఏ డైరెక్టర్ తో మాట్లాడుకుందో తెలుసా? తనే స్టార్ రైటర్ కోనవెంకట్. అవును.. కోనవెంకట్ నిర్మాణ సారధ్యంలో వచ్చే మూడు మూవీలకి అంజలి లీడ్ రోల్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక,  అంజలి ప్రస్తుతం బాలయ్య సరసన ‘డిక్టేటర్’చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తరువాత ఈ భామకు మరో అవకాశం దక్కింది. అయితే ఇందులో అంజలి బందిపోటుగా కనిపిస్తుందట! ఇంతకీ అది ఏ సినిమా అని అనుకుంటున్నారా? కోన వెంకట్ నిర్మిస్తున్న ‘శంకరాభరణం’ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి గెస్ట్ పాత్రలో కన్పిస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: