మెగా ఫ్యాన్స్ ఉత్సాహం ముందు ఏ టాప్ హీరో అభిమానులు కూడ సాటిరారు. ప్రభాస్ అభిమానులే కాకుండా నేటి టాలీవుడ్ టాప్ హీరోల అభిమానులు అందరూ ‘బాహుబలి’ సినిమాను తమతమ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ‘బాహుబలి’ అందరి హీరోల సినిమా అనే నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రచారంలో మెగా అభిమానులు మరింత ఉత్సాహంతో ‘బాహుబలి’ సినిమాను వెబ్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ‘బాహుబలి’ కి సంబంధించిన లేటెస్ట్ వార్తలను లేటెస్ట్ స్టిల్స్ ను మెగా అభిమానుల మధ్య ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ తెగ హడావిడి చేస్తున్నారు.

అయితే మెగా అభిమానులు చేస్తున్న ఈ హడావిడి మెగా కాంపౌండ్ కు ఊహించని షాక్ గా మారింది అని టాక్. దీనికి కారణం రాజమౌళి ‘బాహుబలి’ ప్రమోషన్ కు సంబంధించి అనేక మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో తన ‘బాహుబలి’ సినిమా విశేషాలతో పాటు గతంలో తాను దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమా విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడు కాని ఎందుకో ‘మగధీర’ ను దూరంపెట్టాడు.

రాజమౌళి మాటలలో తనను టాప్ డైరెక్టర్ గా మార్చి టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ‘మగధీర’ సినిమా గురించి కనీసం ఒక్కమాట ఆ ఇంటర్వ్యూలలో చెప్పడంలేదు. ఈ విషయం మెగా కాపౌండ్ దృష్టికి వచ్చి షాక్ అయింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాన్ని ఎక్కడా బయట పడకుండా మెగా కుటుంబం ‘బాహుబలి’ విషయంలో నటిస్తోంది.

అయితే అసలు ఈ విషయాలను ఏమీ పట్టించుకోకుండా తమ నుండి ఎటువంటి ఎటువంటి సంకేతాలు రాకపోయినా ‘బాహుబలి’ ప్రమోషన్ విషయంలో నిస్వార్ధంగా రెచ్చి పోయి మెగాఅభిమానులు ‘బాహుబలి’ ప్రమోషన్ కు చేస్తున్న హడావిడి మెగా కుటుంబానికి షాకింగ్ గా మారడమే కాకుండా ఈ విషయంలో ఏమి చేయలేక మౌనముద్ర వహించారని సమాచారం. అయితే ఈ విషయాలు ఏమాత్రం పట్టించుకోని మెగా అభిమానులు మెగా కాంపౌండ్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: