తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఓ ప్రత్యేక ఉంది. ఇక్కడ నుంచి ఇండస్ట్రీలోకి కొత్త కొత్త హీరోలు రావడం వారి ఇమేజ్ కి తగ్గట్టుగా పేరు తెచ్చుకోవడం జరిగింది. చిరంజీవి తర్వాత ఆయన తమ్ముడు నాగబాబు, పవన్ కళ్యాన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నాగబాబు నిర్మాతగా మారాడు, పవన్ కళ్యాన్ మటుకు స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక చిరు తనయుడు రాంచరణ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, చిరంజీవి అల్లుల్లు  అల్లు అర్జున్, సాయిధర్మతేజ్ ఇప్పటికే  తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయ రంగంపై వెళ్లాడు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపకులు చిరంజీవి


‘ప్రజారాజ్యం’ అనే పార్టీని స్థాపించి దాన్ని కాంగ్రెస్ లోకి విలీనం చేశాడు, కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కి పూర్తిగా ప్రాధాన్యత తగ్గడంతో చిరు సినిమాల వైపు లుక్ వేశారు. 150 వ చిత్రం ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఆక్కడే మెగా అభిమానులకు ఓ తీపి కబురు అందజేశారు నాగబాబు. చిరంజీవి 150 వ చిత్రం ఆయన పుట్టిన రోజు ఆగస్టు 22 ఆ రోజే తన చిత్రం షూటిట్ ముహూర్తం ఖరారు చేశారు. సినిమా ముహూర్తానికి ఛీఫ్ గెస్ట్ గా వ‌చ్చే హీరో మ‌రెవ‌రో కాదు.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు తెలిపాడు.

గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ మెగా ఫ్యామిలీ


ఆ మధ్య గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కి ముగ్గురు అన్నదమ్ములు హాజరై సందడి చేశారు. తర్వాత చిరు,పవన్ కి కొన్ని మనస్పర్ధలు రావడంతో  ఇద్దరు కొంత కాలం దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ ఏ ఫంక్షన్లకు పవన్ అటెండ్ కాలేదు దీంతో మెగా ఫ్యామిలీకి పవన్ పూర్తిగా దూరమైయ్యాడా అన్న డౌట్ వచ్చింది. ఇదే సమయంలో గోపా గోపాల ఆడియో ఫంక్షన్లో పవన్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు తన అన్న అంటే తనకు అపారమైన గౌరవం అని ఇప్పటికీ తన అన్నచాటు తమ్మున్నే అన్న విధంగా మాట్లాడే సరికి పవన్ గాలి మళ్లీ తనవాళ్ల వైపు మళ్లిందా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అన్న‌య్య బ‌ర్త్ డే సెలెబ్రేష‌న్స్ క‌మ్ కొత్త సినిమా ఓపెనింగ్ కు ఛీఫ్ గెస్ట్ గా హాజ‌రవుతూ మెగాఫ్యామిలీ రిలేష‌న్ ను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెబుతున్నారు మెగా బ్ర‌ద‌ర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: