తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు తో నటించడం అంటే చాలా అదృష్టంగా భావించే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కానీ ప్రిన్స్ పక్కన చాన్స్ వచ్చినా కాదనుకుంది ఈ హాట్ భామ ఆమె ఎవరో కాదు రకూల్ ప్రితి సింగ్.   అప్ కమింగ్ హీరోయిన్ గా  తెలుగు సినిమా రంగంలో చకచకా విజయాలతో మెట్లెక్కుతూ, తారాపథానికి దూసుకెళ్ళుతుంది నవ యువ తార రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు ఇండస్ట్రీలో హట్ హాట్ అందాలతో రెచ్చగొడుతూ అందరి హీరోలను తన వైపునకు మల్లించుకుంది ఈ అమ్మడు.  ఇప్పటికే యంగ్ హీరోలతో నటించి ఆ మద్య వచ్చిర లౌక్యం సినిమాతో మంచి హిట్ సాధించింది.


రకూల్ ప్రతి సింగ్ 


ఇప్పుడు  శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం, సుకుమార్ దర్శకత్వంలో  ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో… చిత్రాలను ఇప్పటికే ఒప్పుకొన్న రకుల్ ఎంత ప్రయత్నించినా మహేశ్ సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. అయితే ఈ తరుణంలోనే బ్రహ్మోత్సవం రెగ్యులర్ షూటింగ్ జూలైలో మొదలవుతోంది.  దీనికోసం రకూల్ ని సంప్రదించగా తను నటించలేనని  సున్నితంగా తిరస్కరించింది. దీనికి కారణం  శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ తో ఓ సినిమా వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ త మరో సినిమాలో నటించడం వల్ల షెడ్యూల్స్ కుదరక పోవడంతో రకూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలో బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ సినిమాలో కూడా  ఈ అమ్మడికి చాన్స్ వచ్చిందట. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో బిజీ బిజీగా మారిపోయింది రకూల్ ప్రితిసింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: