ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పక్కన నటించాలంటే అదృష్టం తో పాటు, అభినయం, ఆకర్షణ, రంగు,రూపు అన్ని ఉండాలి. తెలుగులో ఆర్టిస్ట్ ల‌కి చాలా అరుదుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు వ‌స్తుంటాయి.

ఒక్కోసారి అలా అవ‌కాశం వ‌చ్చిన‌, వాటిని కాద‌నుకున్న వాళ్ళు, త‌ర్వాత కావాల‌నుకున్నా, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ఛాన్స్ ని పొంద‌లేని వారు కూడ ఉన్నారు. ఇదిలా ఉంటే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ క‌మింగ్ ఫిల్మ్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఉంద‌నేది ఇండ‌స్ట్రీలో క్లియ‌ర్ గా వినిపిస్తున్న న్యూస్. అందులో టాలీవుడ్ కి చెందిన‌ మరో తార తెర పై మేరవబోతుంది. ఆమె ఎవరో కాదు సింగర్ సునీత.

అవును, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ కమింగ్ మూవీలో ప‌వ‌న్ కి పిన్ని పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కొద్ది నిముషాలు ఉండే ఈ పాత్ర‌కి ఎంతో ప్రాముఖ్య‌త ఉంద‌ని త్రివిక్ర‌మ్‌, సునీత‌కి చెప్ప‌డంతో వెంట‌నే కాద‌నకుండా ఒప్పుకున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. సునీత ఇన్ని రోజులు ఓ మంచి సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కంటూ చెరగని ముద్ర వేసుకుంది.

ఆ మద్య శేఖర్ కమ్ముల సినిమా అయిన  అనామికాలో ఒక్క మెరుపు లా కనిపించింది. తాజా సమాచారం ప్రకారం ప‌వ‌న్‌ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కు సునీతను ఫిక్స్ చేసారంట. దీనికి సంబంధించిన న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంద‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: