తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే భారీ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న పీవీపీ సినిమా సంస్థ. ‘విశ్వరూపం’, ‘బలుపు’, ‘వర్ణ’ లాంటి సినిమాలతో మంచి సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు మరో సినిమాతో అమెరికాలో షూటింగ్ ప్రారంభించాబోతుంది.

ఓ వైపు భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను నిర్మించే పనిలో పడింది. ప్రస్తుతం నాగార్జున-కార్తీ కాంబినేషన్‌లో ఓ సినిమా, అనుష్క ‘సైజ్‌జీరో’, ‘బెంగళూర్ డేస్’ తమిళ రీమేక్ తదితర సినిమాల షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, తాజాగా మరో సినిమా షూటింగ్ మొదలైంది.

ఇదిలా ఉంటే తెలుగు బుల్లితెర హాట్ యాంక‌ర్ అయిన అన‌సూయ సైతం పి.వి.పి బ్యాన‌ర‌ల్ లో ఓ మూవీ చేయబోతుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అన‌సూయ‌ దీనికి సంబంధించిన క‌థ‌ను ఫైన‌ల్ చేయ‌టం, అలాగే ఈ మూవీకి కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కావ‌టం జ‌రుగుతున్నాయి.

అయితే అన‌సూయ ఇందులో లీడ్ రోల్ చేయ‌నుంది. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా సాగే ఈ కొత్త క‌థాంశంలో అన‌సూయ హాట్ గా క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తంగా అన‌సూయ‌కి మంచి నిర్మాణ సంస్థ దొరికింద‌ని, ఇది త‌న ఫిల్మ్ కెరీర్ హెల్ప్ అవుతుంద‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: