‘బాహుబలి’ టాలీవుడ్ కలెక్షన్స్ చరిత్రను ఎంత వరకు తిరగ రాస్తుందో తెలియదు కాని ఈ సినిమా మోజులో జరురుగుతున్న కోట్ల జూదం  చాలా మంది జీవితాలకు ఊహించని ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాలలోను ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తి అయిన తర్వాత కూడ ఈ సినిమా హక్కులను పొందిన బయ్యర్లను రకరకాలుగా ప్రలోభ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఏరియాల వారిగా కొనుక్కున్న బయ్యర్లు ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ ను బట్టి క్యాష్ చేసుకుంటున్నారని టాక్.  ఈ వ్యవహారం రెండు విధాలుగా జరుగుతోందని తెలుస్తోంది.  ఒకటి థియేటర్ల దగ్గర భారీగా అడ్వాన్స్ లు తీసుకోవడం, రెండవ పద్ధతిలో ‘బాహుబలి’ హక్కులను పొందిన బయ్యర్లు ఈ సినిమాకు సంబంధించిన హక్కులను, రూపాయికి రూపాయి లాభంతో అతిగా మోజు పడుతున్న వేరే వాళ్ళకు అమ్మివేయడం లేదంటే తాము కొనుక్కున్న సినిమా హక్కులలో కొంత భాగాన్ని గుడ్ విల్ రేటు నిర్ణయించి భాగస్వాములుగా కొంత మందిని చేర్చుకునే పద్ధతికి సంబంధించి చర్చలు జరుపుతూ ‘బాహుబలి’ హక్కులను పొందిన బయ్యర్లు చాల బిజీగా ఉన్నారని టాక్.  

అయితే బాహుబలి హక్కుల్లో ఎక్కువ భాగం ప్రభాస్ కు అతని సన్నిహితులకు, సాయి కొర్రపాటికి, దిల్ రాజుల వద్ద ఉండటంతో ఈ వ్యవహారం చాల భారీ స్థాయిలో జరుగుతూ పెద్దపెద్ద వాళ్ళ మధ్య కోట్లల్లో చేతులు మారిపోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడిక్కడ ‘బాహుబలి’ హక్కులను  రికార్డు రేట్లకు అమ్మిన నేపధ్యంలో ఈ చివరి నిముషంలో జరుగుతున్న ఈ హక్కుల రీసేల్ మరింత క్రేజీగా మారి ‘బాహుబలి’ విడుదలకు ముందే ఈ సినిమా బయ్యర్లు ఒడ్డున పడతారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 


‘బాహుబలి’ మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయి


ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా బయట వినిపిస్తున్న ఈ వార్తలు చాలామంది మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘బాహుబలి’ మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయి అన్న లెక్కలు వేయడంలో టాలీవుడ్ విశ్లేషకులు చాలా బిజీగా ఉన్నారు. ఏది ఎలా చూసుకున్నా  జూదానికి మించిన మాయలో ‘బాహుబలి’ వ్యాపారం నడుస్తోంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: