ఆమధ్య హాట్ సెమి న్యూడ్  వీడియో వ్యహారంతో  మీడియాకు హాట్ టాపిక్ గా నిలిచిన రాధిక ఆప్టే తిరిగి సంచలన వార్తలలోకి వచ్చింది. బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’, ‘లయన్’ వంటి రెండు భారీ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టేకు మంచి నటిగా పేరు వచ్చినా టాలీవుడ్ హీరోల పక్కన ఎటువంటి అవకాశాలు రావడం లేదు. దీనితో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

టాలీవుడ్ లో కథానాయకుల ఆధిక్యం ఎక్కువగా వుందని  అక్కడి కొందరు దర్శకనిర్మాతలకు స్త్రీల పై అసలు గౌరవమే లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకే  తనకు టాలీవుడ్ లో పలు అవకాశాలు వస్తున్నప్పటకీ తానే వదులుకుంటున్నట్లుగా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.  అయితే రాధిక ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అని టాలీవుడ్ వర్గాలు ఆరా తీస్తున్నారు. 

ఈ హాట్ హీరోయిన్ టాలీవుడ్ లోని ఎవరో కొందరితో మనస్పర్థలు రావడం వల్లనే ఇలా కామెంట్లు చేస్తొందంటూ ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈమె బాలకృష్ణతో  ‘లయన్’  సినిమాలో నటిస్తున్నప్పుడు ఆసినిమా నిర్మాతలతో భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. 

అయితే అప్పుడు బాలయ్య రంగంలోకి దిగి సద్దుబాటు చేసాడని టాక్.  ఇప్పుడు దీనికి కొనసాగింపుగా టాలీవుడ్ హీరోలు కూడ రాధిక మాటలు  బాట్టి రంగంలోకి వచ్చారు కాబట్టి ఈ వ్యవహారంలో రానున్నరోజులలో ఎవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: