‘బాహుబలి’ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ సాధారణ ప్రేక్షకులకే కాకుండా సినిమా సెలెబ్రెటీలకు కూడ పెరిగిపోతున్న నేపధ్యంలో ఈ సినిమా రిజల్ట్ ప్రీమియర్ షోల కారణంగా ఒక్కరోజు ముందుగానే 9 వ తారీఖు రాత్రి బయటకు వస్తుంది అని అంతా భావించారు. అయితే ఈ విషయంలో రాజమౌళి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి అని టాక్. దీనితో రాజమౌళి ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు ఆ శక్తి చూపెట్టడం లేదని సమాచారం.

భారీ సినిమాలకు ప్రీమియర్ లు వేయడం మామూలే. గతంలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలకు చాలా వరకు ప్రీమియర్ లు ఏర్పాటు చేసాడు. ‘మనం’  సినిమాకు నాగార్జున కూడ ప్రీమియర్ షో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో రాజమౌళి కూడ ‘మగధీర’ కు కూడ ప్రీమియర్ షో వేసాడు. అటువంటి రాజమౌళి ఇప్పుడు ‘బాహుబలి’ కి ప్రీమియర్ షోలుకు ఎందుకు అడ్డు పడుతున్నాడో ఎవరికీ అర్ధం కాని పజిల్ గా మారింది.

ఈ వార్తలు ఇలా ఉండగా బాలీవుడ్ సినిమా రంగo కల్చర్ ను అనుసరించి ముంబాయిలో ‘బాహుబలి’ కి ప్రీమియర్ షో వేయాలని కరణ్ జోహార్ పట్టుబడుతున్నా రాజమౌళి పెద్దగా అ శక్తి చూపెట్టడం లేదు అని అంటున్నారు. రాజమౌళి ఉద్దేశ్యంలో నేరుగా ప్రేక్షకులకే ముందు ‘బాహుబలి’ అందించాలన్నది జక్కన్న ఆలోచనగా కనిపిస్తోందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

‘బాహుబలి’ సినిమాను కృష్ణా, గుంటూరు జిల్లాలలో విడుదల చేస్తున్న సాయి కొర్రపాటి ‘బాహుబలి’ విడుదలకు ముందు 9వ తారీఖు రాత్రి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని అనేక ప్రాంతాలలో ‘బాహుబలి’ స్పెషల్ బెనిఫిట్ షోలు వేసి ఆ షోలు వల్ల వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పట్టణానికి విరాళంగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ బయ్యర్లు స్పెషల్ షో వేయడానికి ఒక షోకు పడి లక్షలు అడుగుతున్న నేపధ్యంలో అన్ని ఖర్చులను కలుపు కుంటే ఈ షో టికెట్ మూడు వేల రూపాయలు వరకు ఉండవచ్చు అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. ఇంతకీ రాజమౌళి ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు ఎందుకు అడ్డు పడుతున్నాడు అన్న విషయం రాజమౌళి మనసుకే తెలియాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: