తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయంగా ఇంత దిగజారుడు తనం చూపిస్తానుకోలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎంతో కష్ట పడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కేసీఆర్.   చంద్రబాబు ఎంతో అభివృద్ది సాధించుకోవాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ లో.. ఇలాంటి పరిస్థితిలో తెలుగు ప్రజల మనోభావాలు నొప్పించేలా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. . ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. అంతే కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో తన ప్రాబల్యం చూపించుకోవాడానికి ఎమ్మెల్యేతో బేరసారాల్లో స్వయంగా ముఖ్యమంత్రే భాగస్వామ్యంకావడంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సీతారాం కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్


భవిష్యత్ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే.ఇకపోతే లలిత్ గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగే అవకాశమే లేదని ఏచూరి హెచ్చరించారు. అదేవిధంగా కేంద్రం తీసుకురానున్న భూసేకరణ బిల్లు రైతులకు అనుకూలంగా ఉంటే స్వాగతిస్తామని ప్రకటించారు. లేదంటే ఆ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తామని సీతారం తేల్చి చెప్పారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదిపత్య పోరు ఆపి రాష్ట్ర అభివృద్దికి కృషి చేయాలని ఏచూరి సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: