ఆ మద్య తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమా గుర్తుందికదా..! అందులో విలన్ తమిళ హీరో ఆర్య నటించాడు.. ఈ సినిమా అంత పెద్ద హిట్ కాలేదు కాని ఆర్యకు మాత్రం తెలుగులో మంచి పేరు వచ్చింది. తమిళ్ లో క్రేజీ హీరోగా ఆర్యకు మంచి పేరుంది, అంతే కాదు ఈ హీరోకి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూసింత ఎక్కువే... షూటింగ్ టైమ్ లో అల్లరి చిల్లరిగా అందరినీ నవ్విస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటాడట.


వరుడు సినిమాలో అల్లు అర్జున్, ఆర్య


ఇక మనోడు వంటలు కూడా బాగా చేస్తాడట, ఈ హీరోగారితో నటించిన హీరోయిన్లకు అతను పెట్టే బిర్యానీ మహా ఇష్టంగా తింటారట ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు కూడా ఆర్య బిర్యానీకి చాలా ఫిదా అయిపోయారు. ఇప్పుడు తమన్న ఆర్యతో కలిసి ‘వాసువుం సరవననుం ఒన్న పడిచ్చవంగ’ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే షూటింగ్ సమయంలో ఆర్య చేసే బిర్యాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇది విని తనకు కూడా ఇంకా బిర్యానీ ఆహ్వానం రాలేదు అని తెగ బాధపడిపోతుందట దానికోసం ఎంతగానో ఎదురు చూస్తుందట.

తమన్న,ఆర్య


బహుశా చిత్రం విడుదలైన తర్వాత గ్రాండ్ గా బిర్యానీ పార్టీ ఇస్తాడేమోనని తమన్నా ఎదురుచూస్తోందట. మరి ఈ హీరోగారు తమన్నాకు బిర్యానీ పార్టీ ఎప్పుడిస్తాడో ఆమె అందరు హీరోయిన్ల లీస్టులో ఎప్పుడు చేరుతుందో అని ఆశగా ఎదురు చూస్తుంది పాపం..

మరింత సమాచారం తెలుసుకోండి: