ఏ విషయాన్ని అయినా తన తండ్రి మోహన్ బాబులాగే చాల స్పష్టంగా ఘాటైన మాటలతో మాట్లాడే మంచు లక్ష్మికి తెలుగు సినిమా ప్రేక్షకుల పై విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో తెలుగు సినిమా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ మంచులక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

రియలిస్టిక్ సబ్జెక్ట్స్, కమర్షియాలిటీ లేని సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదో తనకు అర్ధం కావడం లేదని దీనివల్ల మంచి సినిమాలను తీయాలని కోరిక ఉన్నా ఏమి చేయలేక మౌనం వహించవలసి వస్తోందని కామెంట్స్ చేసింది. తమిళంలో ఈమధ్య విడుదలై ఘన విజయం సాధించిన ‘కాక ముట్టై’ సినిమాను చూసి తాను తెలుగులో రీమేక్ చేద్దామని భావిస్తే ఆ సినిమా తెలుగులో ఒక్కరోజు కూడ ఆడదు అని చాలామంది కామెంట్ చేయడంతో ధైర్యం చేయలేక వదిలి వేశానని బాధపడుతోంది మంచువారి అమ్మాయి.

తాను నిర్మించి నటించిన ‘గుండెల్లో గోదారి’ వేరొకరు తీసిన ‘చందమామ కథలు’ మంచి సినిమాలుగా పేరొచ్చినా అవార్డులు వచ్చాయి కాని కలెక్షన్స్ రాలేదని అభిప్రాయ పడుతోంది మంచు లక్ష్మి స్లమ్ ఏరియాలో ఉండే ఇద్దరు పిల్లలు  పిజ్జా తినాలనే కోరికను ఎలా నెరవేర్చుకున్నారనే కథతో రూపొందిన ‘కాక ముట్టై’ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ధనవంతుల సంఖ్య పెరిగి పోతున్న మనదేశంలో కనీస అవసరాలు, సరదాలు కూడ తీరని స్లమ్ ఏరియాలోని నిరుపేద పిల్లల జీవితాల పై తీసిన ఈసినిమాకు అనేక అవార్డులు రావడమే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులు ఈసినిమాను ఆదరించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

సీరియస్ కథను ప్రేక్షకులకు ఎటువంటి బోర్ అనిపించకుండా దర్శకుడు మణికందన్ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. గత నెల జూన్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో ప్రదర్శింప బడటం హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: