తెలుగు ఇండస్ట్రీలో మెగా వారసుడిగా వచ్చిన రాంచరణ్ చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించింది. రాంచరణ్ ‘గోవిందుడు అందరిక వాడేలే’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకంని శ్రీను వైట్ల సినిమాలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే రాంచరణ్ సినీ ఇండస్ట్రీలోనే కాక బిజినెస్ రంగంలో కూడా ముందంజలో ఉన్నాడు.  


రాంచరణ్ ‘టర్బో మెగా’ ఎయిర్ లైన్స్


రాంచరణ్ ‘టర్బో మెగా’ పేరుతో ఓ ఎయిర్ వేస్ సంస్థను ప్రారంభించారు.ఇందులో రాంచరణ్ తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి భాగస్వామిగా వున్నారు. ఈ ఎయిర్ వేస్ కు ‘ట్రూ జెట్’ అనే పేరును ఖరారు చేసారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల సంధర్భంగా ఈ ఎయిర్ వేస్ ను ప్రారంభించనున్నారు. మొదటి ఎయిర్ వేస్ ను హైదరాబాద్ నుంచి రాజమండ్రి పంపనున్నట్లుగా తెలిసింది.  ఈ ఎయిర్ వేస్ గురించి చరణ్ త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలను తెలియజేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: