ప్ర‌స్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్ అంద‌రి దృష్టి స్టైలిష్ స్టార్ పై ఉంటే, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాత్రం ఓ హీరోయిన్ పై దృష్టి సారించాడు. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన హాట్ బ్యూటీ కేథరిన్ థెరిస్సా.


రుద్రమదేవిలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి 


ఈ సినిమాలో అల్లు అర్జున్ – కేథరిన్ కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ భారీ పీరియాడికల్ ఫిల్మ్ రుద్రమదేవిలో కలిసి నటించారు. రుద్రమదేవిలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. గోనగన్నా రెడ్డి పాత్రకి జోడీ అయిన అనామిక దేవి పాత్రలో కేథరిన్ కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మ‌రోకసారి వీరిద్ద‌రూ ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేయ‌నున్నారు.

అల్లు అర్జున్ అప్ క‌మింగ్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమా కోసం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ని ఖరారు చేసారు. తాజాగా మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రేస ని ఫైనలైజ్ చేసారని సమాచారం. బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో కేథరిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

అయితే కేథ‌రిన్ ని హీరోయిన్ గా తీసుకునే వ్య‌వ‌హారంలో, బోయ‌పాటికి ఈ బ్యూటిని అల్లుఅర్జున్ రిఫ‌ర్ చేశాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఒకే హీరోయిన్ తో ఇన్నిసార్లు న‌టించ‌డంపై అల్లుఅర్జున్‌, కేథ‌రిన్ ల కెమిస్ట్రీ ఇలాగే కొన‌సాగుతుందా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూలై 17 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: