తెలుగు తమిళ మళయాళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల అవుతున్న ‘బాహుబలి’ ఏ స్థాయిలో కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేస్తుంది అని అందరూ అంచనాలు వేస్తూ ఉంటే ఈ సినిమామటుకు ఇంకా విడుదల కాకుండానే ఒక విషయంలో రాజమౌళి అంచనాలను తలక్రిందులు చేసి జక్కన్నకు ఊహించని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను హిందీ మలయాళం భాషలలోకి డబ్ చేసిన రాజమౌళి తమిళంలో మాత్రం చాల కష్టపడి తెలుగుతో సమానంగా ప్రతి సీన్ తెలుగు తమిళ భాషలలో నిర్మించడానికి ఒక ట్రేడ్ సీక్రెట్ ఉంది అని టాక్. 

కోలీవుడ్ లో విడుదల అయ్యే డబ్బింగ్ సినిమాల పై ట్యాక్స్ ఎక్కువ వేస్తారు. ఈ సమస్యలనుండి తప్పించు కోవడానికి కష్టమైనా సరే రాజమౌళి తెలుగుతో సమానంగా తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ సినిమాగా తీసి విడుదల చేస్తున్నారు. అయితే తమిళంలో డైరెక్ట్ సినిమాగా విడుదల అయ్యే సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ వస్తే ఆ సినిమాల పై తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి వినోదపు పన్ను విధించదు. 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి తాను తీసిన బాహుబలి సినిమాకు ఏదోవిధంగా సెన్సార్ నుండి క్లీన్ యు సర్టిఫికేట్ సంపాదించి ‘బాహుబలి’ కి ఇంకా చాల లాభాలు గణించాలని స్కెచ్ వేసాడు అని టాక్. అయితే రాజమౌళి ఎంత ప్రయత్నించినా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇవ్వకుండా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చి సరిపెట్టింది.

ఈ సినిమాలో ఉన్న భయంకరమైన యుద్ధాలు రక్తపాతం సన్నివేశాల రీత్యా తాము రాజమౌళి కోరికను మన్నించలేకపోయాము అని సెన్సార్ బోర్డ్ తెలియచేసింది అని టాక్. దీనితో ఎంతో వ్యూహాత్మకంగా కష్టపడి ‘బాహుబలి’ తమిళంలో తీసినా తన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది అంటూ రాజమౌళి బాధ పడుతున్నట్లు సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: