తెలుగు చిత్ర సీమలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అంటే ఓ బ్రాండ్. ఈయన తీసిన సినిమాంటే పూలు, పండ్లు, హీరోయిన్ అవే గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తీయాలంటే ఈయన తర్వాతే.. ఈయన శిష్యుడు దర్శక దీరుడు రాజమౌళి. తాజాగా రాజమౌళి తెరకెక్కించ బోతున్న ‘బాహుబలి’ సినిమా సెన్సార్ కు ముందు తన గురువైన రాఘవేంద్ర రావును ఒక్క సారి చూడమని అడిగాడట  అందుకు ఆయన  సున్నితంగా తిరస్కరించాడట ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. బాహుబలి చిత్రానికి రాఘవేంద్రరావు కూడా ఓ పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు.

బాహుబలి పోస్టర్


ఈ సినిమా చూసి ఏవైనా లోటు పాట్లు ఉంటే చెప్పమని రాజమౌళి తన గురువైన రాఘవేంద్రరావుకి అడిగారట కానీ ఆయన ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు కాబట్టి నేనూ కూడా ఓ ప్రేక్షకుడి మాదిరే ఈ సినిమాను చూడాలి తప్ప ముందుగా చూస్తే నీ ప్రతిభ ఎలా తెలుస్తుంది. అంతే కాదు ప్రేక్షకులతో పాటే ఈ సినిమా చూసి నా ఒపీనియన్ చెబుతానని అన్నాడట..! అంటే గురువుగారికి శిష్యునిపై అంత నమ్మకం ఉంది కాబట్టే ఈ సినిమా ఒక సామాన్య ప్రేక్షకుడిగా చూస్తానని చెప్పారన్నమాట..! అంటే రాఘవేంద్రరావుకి  రాజమౌళి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టే అతడి పనిలో జోక్యం చేసుకోకూడదని అనుకున్నాడట రాఘవేంద్రరావు. కాగా ఈ సినిమా జూలే 10 మూడు భాషల్లో విడుదల కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: