నందమూరి సింహం బాలకృష్ణతో ‘లెజెండ్’ సినిమా చేసి వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ మళ్ళీ తిరిగి బాలకృష్ణ 99వ సినిమాకు అంజలితో పాటు మరో హీరోయిన్ గా ఎంపిక కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రకరకాల హీరోయిన్స్ పేర్లు ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ పరిశీలించిన తరువాత బాలకృష్ణను ఒప్పించి తిరిగి అతడి ఓటును సొనాల్ చౌహాన్ కు వేయించడం వెనుక సొనాల్ ఈ సినిమా దర్శక నిర్మాతల పై ప్రయోగించిన మార్కెట్ మంత్ర ప్రధానంగా పని చేసింది అని అంటున్నారు. 


సొనాల్ కోట్ చేస్తున్న 15 లక్షల పారితోషికం హాట్ టాపిక్


ఈ మధ్యనే విడుదలైన రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలో సోనాల్ చేసిన ఎక్స్ పోజింగ్ ఆమెకు టాలీవుడ్ లో మళ్ళీ మంచి అవకాశాలు వచ్చేలా చేస్తోంది అని అంటున్నారు. అయితే చిన్నచిన్న హీరోయిన్స్ కూడ 25 లక్షలు వరకు తీసుకుంటు, టాప్ హీరోయిన్స్ కోటి పైన డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో సొనాల్ కోట్ చేస్తున్న 15 లక్షల పారితోషికం హాట్ టాపిక్ గా మారి ఈ బ్యూటీకి వరసపెట్టి చాల సినిమాలలో అవకశాలు రావడమే కాకుండా బాలకృష్ణ 99వ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది అని ఫిలింనగర్ టాక్. 

అదేవిధంగా చాలామంది డిమాండ్ చేసే విధంగా 5 స్టార్ హోటల్స్ తనకు అక్కరలేదని తనకు అన్ని వసతులు ఉన్న 3 స్టార్ హోటల్ తనకు సరిపోతుందని అని అనడమే కాకుండా నిర్మాతల పై తన వైపు నుండి ఎటువంటి వృథ ఖర్చులను పెట్టించకుండా సహాయ పడుతున్న సొనాల్ మార్కెట్ మంత్ర ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు హాట్ టాపిక్ గా మారింది.

షూటింగ్ స్పాట్ కు అనుకున్న సమయానికి రావడంతో పాటు ఎటువంటి గొంతెమ్మ కోర్కెలను అడగని సొనాల్ కొత్త వ్యూహాత్మక ఎత్తుగడ ఆమెకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు. బాలయ్య ‘డిక్టేటర్’ హిట్ అయితే టాలీవుడ్ లో సొనాల్ హవా ప్రారంభం అవుతుంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: