ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బాల‌య్య బాబుకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా వినప‌డుతుంది. ఎందుకంటే బాల‌య్య బాబు తాజాగా ఒక‌సారికి ఛాన్స్ ఇచ్చిన హీరోయిన్ ని, మ‌రోసారి త‌న మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, లెజెండ్ చిత్రంలో బాలకృష్టతో జతకట్టి తెలుగుప్రేక్షకుల్ని మెప్పించింది సోనాల్‌చౌహాన్.

ఆమె మరోసారి బాలకృష్ణ సరసన నటించబోతుంది. బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటిస్తోంది. మరో కథానాయికగా సోనాల్‌చౌహాన్‌ను ఎంపికచేశారు.

బాలకృష్ణ గత చిత్రాలకంటే పూర్తి భిన్నంగా వుండేలా ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇటీవలే యూరప్‌లో షూటింగ్ లొకేషన్స్ పరిశీలన జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎవరూ షూటింగ్ చేయనటువంటి లొకేషన్స్‌లో పాటలు, యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అయితే మొద‌ట సోనాల్ చౌహ‌న్, బాల‌య్య మూవీలో అంటే చూద్దాం అని స‌మాదానం చెప్పింద‌ట‌.

త‌రువాత క‌థ విన్న వెంట‌నే, క‌చ్ఛితంగా న‌టిస్తాన‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మొత్తంగా సౌనాల్ చౌహ‌న్ ని హీరోయిన్ గా తీసుకోవాల‌ని ప్ర‌ముఖ హీరోలు ప్ర‌య‌త్నిస్తుంటే, ఈ బ్యూటీ మాత్రం బాల‌య్య బాబు మూవీలో న‌టించ‌టానికి ఆస‌క్తి చూపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: