ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ అంతా టాలీవుడ్ వారసుల హవా తో నిండి ఉంది. టాప్ హీరోల అభిమానులు కూడా వారి వారసులను తమ అభిమాన హీరోలుగా మార్చుకుని వారిని తమ భుజాల పై మోస్తూ వారసత్వ సంస్కృతికి తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టాప్ హీరోలు అందరితో భారీ సినిమాలను తీసిన దిల్ రాజ్ టాలీవుడ్ లో వారసత్వ హీరోల పై చేసిన సంచలన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 

దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారులకు నటించడం రాదని అంటూ సంచలన కామెంట్స్ ఈమధ్య జరిగిననిర్మాతల ఇష్టాగోష్టి సమావేశంలో యధాలాపంగా దిల్ రాజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కామెంట్స్ దిల్ రాజ్ ఏ సందర్భంలో చేసాడో క్లారిటీ లేకపోయినా దిల్ రాజ్ రాఘవేంద్రరావు దాసరిల కుమారులను టార్గెట్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

వారసులకే టాలీవుడ్ లో పెద్ద పీట అన్న కొందరి కామెంట్స్ కు దిల్ రాజ్ సమాధానం చెబుతూ, వారసులు అయినంత మాత్రాన సరిపోదని, నటన కూడా రావాలని అన్నట్లు టాక్. అంతేకాదు దాసరి తన కుమారడు అరుణ్ ను రాఘవేంద్రరావు తన కుమారుడు ప్రకాష్ ను హీరోలుగా టాలీవుడ్ కు పరిచయం చేసినా వారు రాణించలేదు కదా అని కామెంట్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  

అయితే కేవలం వారసత్వంతో నటన రాకపోయినా పెద్దగా అందం లేకపోయినా అనేక ప్రయత్నాలు చేసి చరిత్రలోని గజినీ మహమ్మద్ చక్రవర్తిలా విజయాలు సాధించిన వారసత్వ హీరోలు దిల్ రాజ్ దృష్టికి రాలేదా అంటూ దిల్ రాజ్ కామెంట్స్ పై రివర్స్ కామెంట్లు వేస్తున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: