బుల్లి తెరపై ఈటీవీ ప్రసారాలు మొదలై ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్బంగా రామోజీరావు ఘనంగా  ఈటీవీ 20 సంవత్సరాలు వేడుకలుచేశారు కాకపోతే ఇప్పటికీ ఈ ప్రసారాలు బయటకు రాలేదు. కానీ ఓ  వ్యక్తి ఈ కార్యక్రమంలోని ముఖ్యఘట్టాలు సెల్ ఫోన్ లో షూట్ చేసీ యూట్యూబ్‌లో వదిలారు. అయితే మొన్నటి వరకు సోషల్ నెట్ వర్క్ లో దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కనిపించాయి ఇప్పుడు ఓ ప్రముఖ వ్యక్తి కూడా అందులో హల్ చల్ చేస్తున్నట్లు ఉంది. మరి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా ఆయన మరెవరో కాదండి తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో పవన్ కళ్యాన్.


రామోజీరావు, పవన్ కళ్యాన్,యాంకర్ సుమ


అవును పవన్ కళ్యాన్ ఈ వేడుకలకు హాజరయ్యారు అంతేకాదు ఈ సందర్భంగా మాట్లాతూ ఇలాంటి ఫంక్షన్లకు రావడం తనకు ఇష్టం ఉండదని కానీ రామోజీరావు అంటే తనకు ఎంతో అభిమానమని ఆయన గురించి మాట్లాడే అనుభవం, వయసు తనకు లేదు అని చాలా నిడారంబరంగా మాట్లాడారు. అంతే కాదు ఈ వేడుకలో పవన్ కళ్యాన్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు.  అయితే ఈ ప్రసారాలు త్వరలో ప్రసారం కానున్నాయి కానీ ఇప్పటికే ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: