టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్లీ కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో నాలుగు నెలల క్రితమే అనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తుంది. మొత్తానికి ఈ నెల సెట్స్ పైకి వెళ్లనుంది.  ఈ నెల 6 నుండి 20 వరకు లండన్ లో షూటింగ్ జరుపుకోనుంది. లండన్ లో పీటర్ హెయిన్స్ తో ఎన్టీఆర్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీస్తారట. 


హీరో ఎన్టీఆర్

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపిస్తారని టాక్. ఇక హీరోయిన్ గా అందాల హాట్ భామ రకూల్ ప్రీతి సింగ్ నటిస్తుంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటి వరకు తర్జన భర్జన జరిగినా మొదట టెంపర్ సినిమాలో డైలాగ్ దండయాత్ర అనుకున్నారట. కానీ సినిమా పరంగా చూస్తే తండ్రి సెంటిమెంట్ ఎక్కువ గా ఉండటంతో నాన్నకు ప్రేమతో అనుకున్నారట. కానీ సినిమా మాస్ టైటిల్ తో వెళ్తేనే బాగుంటుందని ‘దండయాత్ర’ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయిస్తున్నట్టు తెలిసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: