నిన్న ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రభాస్ తమన్నాలు ‘బాహుబలి’ ప్రమోషన్ కోసం బుల్లి తెరపైకి వచ్చారు. ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను ప్రభాస్ తెలియ చేస్తూ ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వం వహించని సీన్స్ సుమారు 10 శాతం వరకు ఉన్నాయి అన్న సంచలన విషయాన్ని బయట పెట్టాడు. దీనితో రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని సన్ని వేశాలకు ఎందుకు దర్శకత్వం వహించలేదు అన్న అనుమానం ఆ ఇంటర్వ్యూ విన్న చాలామందికి కలుగుతుంది. 

ఈ చిత్రానికి దర్శకుడు రాజమౌళి అని చాలామంది అనుకుంటారని అయితే రాజమౌళి తన పని ఒత్తిడిలో అందుబాటులో లేనప్పుడు ఈ సినిమాకు సంబంధించిన చాల సీన్స్ దాదాపు 10శాతం జక్కన్న కొడుకు కార్తికేయ తెరకెక్కించినట్లు ప్రభాస్ అసలు గుట్టు బయటకు చెప్పాడు. అయితే కార్తికేయ దర్శకత్వం వహించిన ఆ సీన్స్ ఏమిటి అన్న విషయం తనకు తెలిసినా తాను బయటకు చెప్పనని ఎందుకంటే ఆసీన్స్ లో రాజమౌళి కార్తికేయల మధ్య క్రియేటివిటిలో ఎవరూ గొప్ప అని లెక్కలు వేస్తారు అని అందువల్ల ఆ సీన్స్ ఎక్కడ వస్తాయో తాను చెప్పనని నవ్వుతూ జోక్ చేసాడు ప్రభాస్. 

అంతేకాదు ఈ సినిమాకు పేరుకు రాజమౌళి దర్శకుడే అయినా అతని వెనుక కార్తికేయ రమా రాజమౌళి వల్లీ కీరవాణీల సహకారం లేనిదే ఈ సినిమా ఇంత భారీ స్థాయిలో పూర్తి అయి ఉండేది కాదని అంటూ బాహుబలి వెనుక ఉన్న శక్తుల గురించి బయట పెట్టాడు ప్రభాస్.  ఈ వార్తలు ఇలా ఉండగా ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి  ఇంకా రీరికార్డింగ్ జరుగుతోంది అదే పనిలో రాజమౌళి, కీరవాణి బిజీగా ఉన్నారు అంటూ కొన్ని చోట్ల మీడియాలో వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

బహుశా ‘బాహుబలి’ తమిళ మలయాళ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ వార్తలు వచ్చి ఉంటాయి అని అంటున్నారు. నిన్న కీరవాణి పుట్టినరోజు అయినా ఆయన కాని రాజమౌళి కాని ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ముంబాయిలో ‘బాహుబలి’ సినిమా పనులలో బిజీగా ఉండటంతో ‘బాహుబలి’ చివరి నిముషం చెక్కుళ్ళు ఇంకా పూర్తి కాలేదు అంటూ వార్తల హడావిడి వినపడుతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: