పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ ప్రారంభ దశలోనే కార్పోరేట్ సినిమా సంస్థ ఈరోస్ వేసిన స్కెచ్ లో ఇరుక్కుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘గబ్బర్ సింగ్ -2' కు షూటింగ్ ప్రారంభదశలోనే భారీ ఢీల్ కుదిరింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని రూ. 72 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నింటిని ఇంత భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్. ఈరోస్ సంస్థ 72 కోట్లు ఈ సినిమా పై పెట్టుబడి పెడుతోంది అంటే పవన్ సినిమా పై ఈరోస్ బిజినెస్ 100 నుండి 120 కోట్లు చేసే ప్రయత్నంలో ఉంది అని టాక్.‘గబ్బర్ సింగ్-2' చిత్రం షూటింగ్ మే 29 మహారాష్ట్రలోని పడమటి కనుమల ప్రాంతంలో ప్రారంభించారు అన్న విషయం తెలిసిందే.

అయితే జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తి అయినా ఈ సినిమా ప్రధాన షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాకపోవడమే కాకుండా పవన్ ఈ సినిమా షూటింగ్ లో ఇంకా రంగ ప్రవేశం చేయని నేపధ్యంలో ఈ నెలలో ప్రధాన షెడ్యూల్ పవన్ తన కొత్త లుక్ తో ప్రారంభిస్తాడని సమాచారం. పవన్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో తన గెడ్డంతో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

 ఈరోస్ నిర్మాణ సంస్థ తాను కొనుక్కున్న సినిమాల విషయంలో చాల కచ్చితమైన కండిషన్స్ పెడుతుంది అన్న వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి. అయితే పవన్ కళ్యాణ్ ఈరోస్ దూకుడుకు తట్టుకోగలడా అంటూ అప్పుడే సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అత్తారింటికి దారేది’ తరువాత గత రెండు సంవత్సరాలలో పవన్ కేవలం తన సినిమాల విషయంలో కష్టపడింది 20 రోజులు మాత్రమే అనే విశ్లేషణలు ఉన్నాయి. సినిమా షూటింగ్ ల విషయంలో బద్దకస్తుడుగా పేరుగాంచిన పవన్ ఈరోస్ దూకుడును ఎలా తట్టుకుంటాడు సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: