ఈనెలలో ప్రారంభం కాబోతున్న గోదావరి పుష్కరాల పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఉభయగోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చి తెలుగువారి అదృష్టంగా మారిన గోదావరితో తన అనుబంధం విడదీయలేనిది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాకుండా గోదావరితో తనకున్న అనుబంధాన్ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు చిరంజీవి. 

తాను నరసాపురం కాలేజీలో చదువుతున్న రోజులలో తాను తీసుకున్న రూమ్ ఎదురుగా గోదావరి కాలువ ఉండటంతో నిరంతరం తను గోదావరిని చూస్తూ కాలం గడిపేవాడినని అంటూ ఆ సమయంలో తరుచూ తాను నర్సాపురం దగ్గర చేసిన సముద్రస్నానాల జ్ఞాపకాలు తనకు ఇప్పటికీ గుర్తు అంటూ తన చిన్ననాటి రోజులను గుర్తుకు చేసుకున్నాడు చిరంజీవి.

గోదావరి ఒడ్డున కనిపించే అందచందాలు పాపికొండలు మధ్య ఉన్న ప్రకృతి సౌందర్యం తనకు ప్రపంచంలో ఎక్కడా అంత అందంగా కనిపించలేదు అంటూ గోదావరితో తన అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు చిరంజీవి. పుష్కర స్నానాల గురించి మాట్లాడుతూ సాధారణంగా ఏ వ్యక్తికి అయినా అతడి తాత ముత్తాతల వరకే వారి వంశ వృక్షం తెలుస్తుందని అయితే మనకు తెలియకుండా ఉండిపోయిన ఏడు తరాల మన తాత ముత్తాతలను తలుచుకుని గౌరవించే అవకాశం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక్క పుష్కరాలలోనే లభిస్తుంది కాబట్టి తనకు పుష్కర స్నానం అంటే ఎంతో ఇష్టం అంటూ గోదావరితో తన బంధాన్ని గుర్తుకుచేసుకున్నాడు చిరంజీవి.

అంతేకాదు తాను తన కుటుంబ సభ్యులతో గోదావరి పుష్కరాలలో పుష్కర స్నానాలు చేసి ఆ సమయంలో కూడా తన మెగా పవర్ చాటుతాను అంటున్నాడు. అయితే గోదావరి ప్రాంతాన్ని అక్కడి నేపధ్యాన్ని ఇంతగా ప్రేమించే చిరంజీవి ఆ జిల్లాల అభివృద్ధికి తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడ ఏమి చేయలేకపోయినా గోదావరి ప్రాంతాల పై ప్రేమకురిపిస్తూ మాట్లాడటం చిరంజీవి గొప్పతనం అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: