ప్రస్థుతం టాలీవుడ్ ను ప్రభాస్ మ్యానియా షేక్ చేస్తోంది. ఈ వారం విడుదల కాబోతున్న ‘బాహుబలి’ రిజల్ట్ కోసం నిరీక్షణలో ప్రభాస్ కు నిద్ర పట్టడంలేదని తానే స్వయంగా మీడియాకు లీక్ చేసాడు ప్రభాస్. ఈరోజు అన్ని పత్రికలలోనూ ప్రభాస్ ఇంటర్వ్యూలే కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో అమ్మాయిల పై విచిత్రంగా కామెంట్ చేసాడు ప్రభాస్. తనంటే చాలామంది అమ్మాయిలకు ఇష్టం అన్న సంగతి తనకు తెలిసినా తనను అమ్మాయిలు ఎందుకంత ఇష్టపడుతున్నారో అన్న కారణం పై తాను ఎంత ఆలోచించినా తనకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు అంటూ విచిత్రమైన కామెంట్స్ చేసాడు ప్రభాస్.

తనకు అమ్మాయిలపై ఉన్న అభిప్రాయం రెండేళ్ళకు ఒకసారి మారిపోతూ ఉంటుందని ప్రస్తుతం తనకు బాగా మాట్లాడే అమ్మాయిలంటే బాగా ఇష్టమని అంటూ కామెంట్ చేసాడు ప్రభాస్. అయితే ఇలా రెండేళ్లకోసారి అమ్మాయిల విషయంలో అభిప్రాయాలు మార్చుకుంటే చాల కష్టమని తన పెదనాన్న కృష్ణంరాజు ఈమధ్యనే గట్టి క్లాస్ పీకారని నవ్వుతూ చెప్పాడు ప్రభాస్. 

ఇదే సందర్భంలో తన పెళ్ళి గురించి మాట్లాడుతూ రూమర్లు వస్తున్నాయి కదా అని పెళ్ళి చేసుకోలేను కదా టైమ్ వచ్చినప్పుడు తన పెళ్ళి జరుగుతుందని అప్పటి వరకు తనకు ఎవరు ఎన్నిసార్లు అయినా పెళ్ళిళ్ళు నిశ్చితార్దాలు చేసుకోవచ్చు అంటూ సెటైర్లు వేసాడు ప్రభాస్. 

‘బాహుబలి’ సినిమాను తన కష్టాలలో వెన్నంటి ఉండి తనను ప్రోత్సహించిన తన తల్లికి అక్కకు బహుమతిగా ఇస్తున్నానని అంటూ ఆమధ్య తనకు షూటింగ్ లో తగిలిన గాయానికి సంబంధించి ఏర్పడిన నొప్పి ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో ఒక హాస్పటల్ కు వెళ్ళి చూపెట్టుకుంటే మధ్యలో తనకు తెలిసిన ఒక క్యాన్సర్ డాక్టర్ తనను అభిమానంతో పలకరిస్తే తనకు క్యాన్సర్ వచ్చింది అంటూ వార్తలు వ్రాసిన వారిని చూసి ఏ మనాలో అర్ధంకాక తెగ టార్చర్ పడ్డానని అంటూ తన జీవితానికి రూమర్స్ పెద్ద టార్చర్ గా మారిపోతున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ప్రభాస్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: