గత శుక్రువారం చిన్న సినిమాగా విడుదలైన సూపర్ స్టార్ కిడ్నాప్ మహేష్ అభిమానులను ఆకర్షిస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మహేష్ సొంత బావ సుధీర్ బాబు సినిమాల వంక చూడటానికి కూడ ఇష్టపడని మహేష్ అభిమానులు ఈ చిన్న సినిమా వంక ఆసక్తి కనపరుస్తూ పాజిటివ్ టాక్ ను ఒకరికొకరు షేర్ చేసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా  మారింది. 

సుశాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు మహేష్ క్రేజ్ ను వాడుకుంటూ కామెడీ క్రైమ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో అడుగడుగునా మహేష్ ప్రస్తావన రావడమే కాకుండా మహేష్ ‘మురారి  2’ చిత్రంలో నటిస్తున్నప్పుడు మహేష్ ను కిడ్నాప్ చేయాలి అనే ఒక క్రైమ్ ఆలోచన వచ్చిన ముగ్గురు యువకులు పడే ఆలోచనలను చాల సరదాగా తీయడంతో ఈ సీన్స్ మహేష్ బాబు అభిమానులకు నచ్చడమే కాకుండా మహేష్ ‘మురారి 2’ సీక్వెల్ లో నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలను ఈ సూపర్ స్టార్ కిడ్నాప్ క్రియేట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలు గతంలో ‘మురారి’ సినిమాను తీసిన కృష్ణవంశీ వరకు వెళ్ళడంతో నిజంగానే ‘మురారి 2’ తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి తన ఆలోచనలను ప్రిన్స్ మహేష్ బాబుతో షేర్ చేసుకుంటే కథ తయారు చేయండి ఆలోచిద్దాo అని మహేష్ కృష్ణవంశీకి భరోసా ఇచ్చాడని ఫిలింనగర్ టాక్. 

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ హవా నడుస్తోంది కాబట్టి నిజంగానే ‘మురారి 2’ ఆలోచనలు కార్య రూపం దాలిస్తే ఆ క్రెడిట్ సూపర్ స్టార్ కిడ్నాప్ సినిమాకు చెందుతుంది అనుకోవాలి. చిన్న సినిమాగా వచ్చి ‘బాహుబలి’ విడుదలకు ముందు దీపావళి సిసింద్రిలా అల్లరి చేస్తున్న ఈ సినిమా మహేష్ పేరుకు ఉన్న క్రేజ్ ను మరోసారి రుజువు చేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: