ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ఫిల్మ్ కెరీర్ ని మళ్ళీ చక్కదిద్దుకుంటున్న బ్యూటీ అంజలి. గత కొంత కాలంగా అంజలి ఫిల్మ్ కెరీర్ వివాదాల మయం కావడంతో, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ తిరిగి తన ఫిల్మ్ కెరీర్ ని గాడిలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటా, తాజగా అంజలిపై కోలీవుడ్ లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం అంజలి తెలుగు, తమిళ భాషల్లో నాలుగు పైగా సినిమాలను చేస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం అంజలి తన పిన్ని క్రియేట్ చేసిన వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు పడింది. ఆ వివాదాల నుంచి ఎలాగో బయటపడిన అంజలి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ తాజాగా అంజలి తమిళంలో చేస్తున్న సినిమా‘మాప్పిల్లై సింగం’. 

గత ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం అంజలి 54 రోజులు కాల్షీట్స్ ఇచ్చింది. కానీ మేకర్స్ వాటిని సరిగా వాడుకోకుండా అందులో సగం రోజులు మాత్రమే షూటింగ్ కి వినియోగించుకున్నారు. దాంతో మిగిలిన టాకీ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఈ చిత్ర మేకర్స్ మళ్ళీ అంజలిని ఫ్రెష్ డేట్స్ ఇమ్మని అడుగుతున్నారు. కానీ ప్రస్తుతం అంజలి పలు తెలుగు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంది.

దాంతో అంజలి‘మాప్పిల్లై సంగం’ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో పెట్టుకోమని కోరింది. దానికి ఈ చిత్ర మేకర్స్ ఒప్పుకోకుండ్ అంజలి తమ సినిమా షూటింగ్ కి కోపరేట్ చేయడం లేదనే కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దాంతో అంజలి జరిగిన విషయాన్ని మీడియాకి చెప్పడమే కాకుండా, తనపై నెగటివ్ కామెంట్స్ రాకుడదని ముందుగానే విజ్ఞప్తి చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: