నాగార్జున ఏ విషయంలో అయినా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అనే పేరు ఉంది. తాను చేసే వ్యాపారాల విషయాలలోనే కాదు తాను నిర్మించే సినిమాల విషయాలలో కూడా చాల ప్రాక్టికల్ గా నాగార్జున వ్యవహార శైలి ఉంటుందని అతడి సన్నిహితులు అంటారు. నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ సినిమా నిర్మించే బాధ్యతను నితిన్ కు అప్పచేప్పినప్పుడు ఈ సినిమా బడ్జెట్ ను ఎట్టి పరిస్తుతులలోను 30 కోట్లను మించి దాటి వెళ్ళవద్దని నాగ్ నితిన్ కు ముందుగానే హెచ్చరించాడు అని టాక్.

అయితే ఈ సినిమాకు వినాయక్ తోడు కావడంతో ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే దాదాపు 40 కోట్లకు చేరిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమా నిర్మాణం పూర్తికాని నేపధ్యంలో మరో 5 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు అవసరం అన్న అంచనాలు రావడంతో అన్నీ లెక్క చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లకు చేరుకుంటుందని ఫిలింనగర్ టాక్.

ఈ వార్తలను తెలుసుకున్న నాగార్జున నితిన్ తన వద్దకు పిలిపించుకుని ఇంత భారీగా ఒకకొత్త హీరో సినిమా పై ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అంటూ నాగ్ నితిన్ కు  క్లాస్ తీసుకున్నాడని టాక్. అఖిల్ స్టామినాను దృష్టిలో పెట్టుకుంటే ఎట్టి పరిస్తుతులలోను 35 కోట్లకు మించి ఖర్చు పెట్టడం శ్రేయస్కరం కాదని అంతకు మించి ఖర్చు అవడంతో ఈసినిమా మార్కెట్ అవడంలో సమస్యలు తలెత్తితే నిర్మాతగా నితిన్ కు నష్టాలు రావడమే కాకుండా తన కొడుకు అఖిల్ సినిమా సరిగ్గా మార్కెట్ కాలేదు అన్న అపఖ్యాతి తనకు రాదా అని నితిన్ కు నాగ్ క్లాస్ పీకినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఏ హీరో తండ్రి అయినా తన కొడుకు సినిమాకు ఇంకా భారీగా ఖర్చుపెట్టమని నిర్మాతలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుతపరిస్థుతులలో తన కొడుకు అఖిల్ సినిమా విషయంలో కూడ చాల వ్యాపార దృష్టితో ఆలోచిస్తూ నితిన్ కు నాగ్ క్లాస్ ఇవ్వడం బట్టి నాగార్జున వ్యాపార తెలివితేటలు మరోసారి బయట పడ్డాయి అంటూ నాగ్ పై సెటైర్లు పడుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: