ప్రస్తుతం హీరోయిన్స్ అంటే క్రేజ్ ఉండని వారు ఉండరు. అంతే కాకుండా ప్రత్యేకమైన ఈవెంట్స్ కి స్టార్ హీరోయిన్స్ వద్ద నుండి అప్పుడే క్రేజ్ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ వరకూ...ఎవరు డేట్స్ అడ్జెస్ట్ అయితే వారిని పిలుపించుకొని, ఈవెంట్ కి క్రేజ్ క్రియేట్ చేయటం ఎంతైన మనీని ఖర్చుచేస్తారు ఆర్గనైజర్లు. సరిగ్గా అలాంటిదే ఓ హీరోయిన్ విషయంలో ఇది జరిగిందట.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, అందాలతారల కోసం సినిమా చూసే వీరాభిమానులు ఎందరో ఉన్నారు. తమ అభిమాన హీరోయిన్‌ సినిమాను తనివితీరా చూడాలని కొందరు తహతహలాడుతుంటారు. అయితే ఇదే ఫార్ములాని అమెరికాలోని నాట్స్‌' వేడుకల్లో ఉపయోగించి భారీగా బిజినెస్‌ చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం డెట్రాయిట్‌లో తానా సభలు, లాస్‌ఏంజిల్స్‌లో నాట్స్‌ సంబరాలు సాగుతున్నాయి.

అయితే నాట్స్‌ వేడుకలకు సంబంధించిన టిక్కెట్స్‌ కొనేవాళ్లు లేక షో వెలవెలబోయింది. అయితే ఈ ఉత్సవాలకు బ్యూటీక్వీన్లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, తాప్సీ హాజరవుతున్నారని చేసిన ప్రచారంతో చివరి నిమిషంలో అంటే సరిగ్గా ఉత్సవాల ప్రారంభానికి ముందు బ్యాలెన్స్‌ టిక్కెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయట. యుఎస్‌ ఎంబసీలో వీసా సమస్య తొలగిపోయి రకుల్‌ ఈ వేడుకలకు రాబోతోంది.

ఈ భామ విమానం ఎక్కేసింది అన్న ప్రచారంతో టిక్కెట్ల అమ్మాకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా యువ కథానాయిక రకుల్‌కి ఎన్నారై కుర్రాళ్లలో వీరాభిమానులున్నారు. రకుల్‌ అంటే పడిచచ్చేంత క్రేజు ఉంది.  దీంతో నాట్స్ సంబరాల కోసం రకుల్ ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: