కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి నిన్న ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పగను పెంచుకున్న ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని వివరించాడు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ సినిమాలలో సరైన అవకాశాలు లేక ఇల్లు గడపడం కోసం ఘోస్టు రైటర్ గా చెన్నైలో పనిచేస్తున్నప్పుడు తమ కుటుంబ సభ్యుల అవసరాలు తీరాలి అంటే అప్పులే దిక్కుగా రోజులు గడుపుతున్న నేపధ్యంలో ఒక వ్యక్తి తనకు చేసిన అవమానానికి ప్రతీకారంగా ఆ వ్యక్తిని తాను డబ్బు సంపాదించాక రౌడీలతో కొట్టిద్దామని అనుకున్నాను అంటూ తన బాధను షేర్ చేసుకున్నాడు రాజమౌళి.

తెల్లవారితే అప్పులతో రోజులు గడిచే తన చిన్ననాటి రోజులలో కిరాణా సరుకులకు కూరలకు ఇలా ప్రతి చిన్న విషయానికి తమ కుటుంబానికి షాపులలో అప్పులు ఉండేవని ఆ అప్పులు పెరిగి పోవడంతో తన తండ్రి మొహమాటంతో కిరాణాలో సరుకులను తేవడానికి తనను పంపేవాడని ఆనాటి సంఘటనలను గుర్తుకు చేసుకుని బాధ పడ్డాడు రాజమౌళి.

ఒక సందర్భంలో ఒక షాపుకు టమోటాల కోసం ఆ షాపు యజమాని దగ్గరకు వెళ్ళి ‘అన్నా అన్నా’ అంటూ వినయంగా అడిగినా అతడు పట్టించుకోకపోవడంతో గట్టిగా అడిగానని దానికి ఆ షాపు యజమాని ‘ఒరేయ్ ఆగరా’ అని అనడంతో తనకు విపరీతమైన కోపం మరియు ఏడుపు వచ్చి తాను బాగా సంపాదించాక ఆ వ్యక్తిని రౌడీలతో చితక కొట్టిద్దామని నిర్ణయానికి వచ్చానన్న విషయాన్ని బయట పెట్టాడు రాజమౌళి. 

అయితే ఇప్పటికీ తాను చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆ సంఘటన తనకు గుర్తుకు వచ్చి ఆ షాపు యజమానిని తన్నించాలని తన మనస్సు ఆరాట పడినా చాల కష్టపడి నిగ్రహించుకుంటాను
అని చెప్పాడు జక్కన్న. తన తాత వందలాది ఎకరాలకు యజమానిగా కాలం గడిపితే తన తండ్రి దగ్గరకు వచ్చే సరికి ఒక్క ఎకరం కూడా మిగలలేదని అంటూ, ఈ జీవితంలో ఏదీ శాస్వితంకాదు అన్న విషయాన్ని తెలుసుకుని తన పాత పగను వదిలేసాను అని అంటున్నాడు విజయానికి రాజముద్రగా మారిన రాజమౌళి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: