ఈ సంవత్సరపు సమ్మర్ హీరోయిన్ గా టాలీవుడ్ కోలీవుడ్ లలో వరస విజయాలను అందుకున్న నిత్యామీనన్ కొంతకాలం తన సన్నిహితులతో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేసి తిరిగి తన సినిమాల వైపు దృష్టి పెట్టింది ఈ కేరళ కుట్టి. నిత్యా ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 18 సంవత్సరాల వయస్సులో ఉండగానే నడిపిన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. 

సినిమాలలోని ప్రేమ సన్నివేశాలలో తాను సహజంగా నటించడానికి తాను 18 సంవత్సరాల వయస్సులో నడిపిన ప్రేమ వ్యవహారం అనుభవాలు తనకు బాగా సహకరించాయని అందువల్లనే తాను ప్రేమ సన్ని వేసాలలో నటించేడప్పుడు సింగిల్ టెక్ తో తన సీన్స్ దర్శకుడికి నచ్చే విధంగా పూర్తి చేయగలుగుతున్నానని అంటూ తన టీనేజ్ లవ్ స్టోరీని బయటపెట్టింది నిత్య.

అయితే ఆ ప్రేమ వ్యవహారం ముగిసిపోయి చాల సంవత్సరాలు గడిచిపోయానని అందువల్ల ఆ విషయాలు తనను అడగవద్దని అంటూ ఆ అనుభవాలు మాత్రం తనకు బాగా పనికి వచ్చాయి అని కామెంట్స్ చేసింది నిత్య. చాలామంది దర్శకులు తన కళ్ళతో అనేక భావాలు పలికిస్తూ ఎలా నటిస్తావు అని అడుగుతారని తన జీవితపు అనుభవాలు తన కళ్ళల్లో అనేక భావాలు పలికించేలా సహకరించాయని చెపుతోంది.

తాను సినిమా షూటింగ్ తరువాత బయట చాల సీరియస్ గా ఉంటానని కామెంట్స్ చేస్తూ ఉంటారని అయితే తాను ఎంత అల్లరి చేస్తానో చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు అని అంటూ తన అభిమానాన్ని ఎవరైనా దేబ్బతీస్తారు అన్న ఉద్దేశ్యంతో తాను బయట గoభీరంగా కనిపిస్తాను అని అంటూ విజయాలకు పొంగిపోవడం పరాజయాలకు కుంగి పోవడం తనకు చేతకాని పని అంటూ కామెంట్స్ చేస్తోంది నిత్యామీనన్..    



మరింత సమాచారం తెలుసుకోండి: