చెవికి పోగు పెట్టుకుని అందమైన డ్రస్ వేసుకుని హడావిడిగా కనిపించే వెంకటేష్ కు మనసు నిండా ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అన్న విషయం అతని సన్నిహితులు అందరూ చెపుతూ ఉంటారు. అయితే వెంకటేష్ కు స్వామి వివేకానందుడు అన్నా రామకృష్ణ పరమహంస అన్నా విపరీతమైన ఇష్టం. ఒక సందర్భంలో ఎవరైనా వివేకానంద జీవితం పై సినిమాను తీస్తే తాను ఎటువంటి పారితోషికం తీసుకోకుండా నటిస్తాను అంటూ వెంకీ ఒక ఇంటర్వ్యూలో కూడ చెప్పాడు. అయితే ఆ సాహసం ఎవరూ చేయలేదు. 

ఇది ఇలా ఉండగా గత వారం అమెరికాలో జరిగిన తానా, నాటా ఉత్సవాలలో అతిధిగా పాల్గొన్న వెంకటేష్ తన ఆధ్యాత్మిక భావాలను ఎన్నారైలతో పంచుకుని అక్కడ వారికి షాక్ ఇచ్చాడు. ఎన్నారైలు తమ జీవితాలలో ఎంతో సక్సస్ ను సాధించినా ఇంకా చాలామంది అసంతృప్తితో ఎందుకు ఉంటారో తనకు అర్ధం కావడంలేదని షాకింగ్ కామెంట్స్ చేసాడు వెంకటేష్. 

నిజానికి అసంతృప్తికి మించిన శత్రువు మనిషికి మరొకటి లేదని భవిష్యత్ గురించి ఆలోచించడం కంటే నేటి గురించి ఆలోచించడమే ముక్తి మార్గం అంటూ జ్ఞానబోధ చేసాడు వెంకటేష్. మనమేమిటో మనం తెలుసుకుని పక్కవారి ఎదుగుదలకు సహకరించినప్పుడే దేవుడు మనకు సహకరిస్తాడు అన్న వేదాంత సారాన్ని ఎన్నారైలకు విడమర్చి చెప్పాడు వెంకటేష్.

యోగా, స్పిరిట్యువల్ సైన్సు గురించి తెలుసుకుంటే మనలోని దేవుడు మనకే దర్శనమిస్తాడని మనుషులు అంతా ఒకటే అన్న భావన మనలో వస్తే మన సమస్యలకు పరిష్కారం అదే దొరుకుతుందని అంటూ వెంకీ ఇచ్చిన స్పీచ్ తో ఎన్నారైల మైండ్ వాష్ అయిందని టాక్. అంతేకాదు ఒక టాప్ హీరోలా కాకుండా ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తలా వెంకటేష్ మాట్లాడిన మాటలు ఎన్నారైల ఆలోచనా సరళిని ఎంత వరకు మారుస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: