బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా అందరినీ అలరించిన హీరోయిన్ కరీనా కపూర్...ఆ మద్య వచ్చిన ‘హీరోయిన్’ సినిమాలో కరీన తన అందాలతో బాలీవుడ్ ను షేక్ చేసింది. తాజాగా ఈ అమ్మడు ఓ ఐటమ్ సాంగ్ తో మళ్లీ జనాల మతులు పోగొట్ట బోతుంది. సయిఫ్ అలీ ఖాన్ తో వివాహం జరిగిన తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుంది ఈ అమ్మడు. కరీనా సల్మాన్ ఖాన్ తో ‘భజరంగీ భాయిజాన్’ సినిమాలో నటిస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో   అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రదర్స్‌'. ఇందులో కరీనా కపూర్‌ ఖాన్‌ 'మేరా నామ్‌ మేరీ' అనే ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది.


కరీనా కపూర్ ఐటమ్ సాంగ్


ఈ పాటకు సంబంధించిన ఫోటో ఒక చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో కరీనా చాలా హాట్ హాట్ గా కనిపిస్తుంది. గతంలోనూ కరీనా ‘మెరీ ఫోటోకో సీనేసే’ అనే పాటలో సల్మాన్ ఖాన్ తో హాట్ హాట్ గా డ్యాన్స్ చేసింది. ఇప్పుడు ఈ మేరీ పాటతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో హల్ చల్ క్రియేట్ చేయబోతుందిని చిత్ర యూనిట్ అంటున్నారు.  ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, అక్షయ్‌ కుమార్‌, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చిత్ర యూనిట్ ట్విట్

మరింత సమాచారం తెలుసుకోండి: