ఈ మాట వింటుంటే తెలుగు ఇండస్ట్రీలో మరో సంచలనం రాబోతుందా అనిపిస్తుంది టాలీవుడ్ ప్రేక్షకులకు.. ఎందుంటే మహేష్ ఇప్పటి వరకు చాలా వరకు కమర్షియల్ సినిమాల్లో నటించాడు. ఇక పోతే తెలుగు సినిమాల్లో ప్రయోగాల గని దర్శక ధీరుడు రాజమౌళి. వీరిద్దరి కలయి ఎలా ఉంటబోతుందా..! మహేష్ బాబుతో ప్రయోగాత్మక చిత్రం తీస్తారా..? లేదా కమర్షియల్ సినిమా తీస్తారా అని ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహేష్ ఇప్పటి వరకు  అగ్ర, కొత్త దర్శకులతో పనిచేసారు. కానీ ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో మాత్రం మహేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు.

బాహుబలి లో ప్రభాస్


 రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక్క సినిమా అయినా చేయాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా రాజమౌళి తీసిన ‘బాహుబలి - ది బిగెనింగ్’  చిత్రం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజమౌళి మాట్లాడుతూ మహేష్ తో తాను చేయబోయే సినిమా వివరాలపై ఓ క్లారిటీ ఇచ్చేసాడు. వాస్తవానికి మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో ఖరారు అయ్యిందని  నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మించబోయే ఈ సినిమా కోసం మహేష్ ఎప్పుడో సైన్ చేసాడని’ తెలిపాడు.

హీరో మహేష్ బాబు


జులై 10న విడుదల కానుంది , ఈ సినిమా విడుదలయ్యాక మళ్లీ ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ పనుల్లో రాజమౌళి బిజీ కానున్నాడు. మరి మహేష్ తో రాజమౌళి ఎప్పుడు సినిమా తీస్తాడో ఏమో భవిష్యత్తులోనే తెలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: