ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ స్పందించాడు. తనకు రాజకీయ అవగాహన లేదు అని విమర్శిస్తున్న విమర్శకుల మాటలకు గ్యాప్ ఇవ్వాలనే వ్యూహాత్మక ఎత్తుగడ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వ్యవహారంలో కనిపించింది. కాని ఏ విషయం పైన పవన్ ఇంకా సూటిగా స్పందించడానికి ఇష్టపడటం లేదు అని పవన్ మాటలను బట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులకు అర్ధం అయింది. 

రాష్ర్టాలు విడిపోయిన పరిస్థితుల్లో ఒక పార్టీ అధినేతగా బాధ్యతగా మాట్లాడాలి కాని చాలామంది రాజకీయ వేత్తలులా నోరు పారేసుకోవడం తనకు ఇష్టంలేదు అంటూ వివిధ పార్టీలలోని అనేక మంది రాజకీయనాయకులకు షాక్ ఇచ్చాడు పవన్. 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను పొగుడుతూ హరీష్ రావును టార్గెట్ చేయడం చంద్రబాబు పై మౌనం వహిస్తూ అశోక గజపతిరాజు, తోట నరసింహం లాంటి నాయకులు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నలు కురిపించాడు పవన్ కళ్యాణ్. అయితే వివిధ సమస్యల పై స్పందించడానికి తాను ఇంకా సిద్ధం కాలేదని రాజకీయాలు నాకు కొత్తా అంటూ మరో విషయాన్ని తెరపైకి తెచ్చాడు పవన్. 

తెలుగు ప్రజలు విడిపోయినా అందరూ ఒక్కటే అన్న భావనతో ఉండాలని అలాకాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ ఇలాగే కొనసాగితే అంతర్ యుద్ధాలు వస్తాయి అంటూ ఆంధ్రోళ్లు అంటే ఒక కులం కాదని ఆంధ్రులు ఒక జాతి అని పవన్ చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉన్నా ఇంకా ప్రతి విషయంలోను సమాధానంలేని ఎన్నో ప్రశ్నలకు పవన్ ప్రెస్ మీట్ మరోసారి తెర తీసింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: