ప్రస్తుతం అమ్మాయిల డార్లింగ్ గా టాలీవుడ్ ను ఏలుతున్న ప్రభాస్ ఇమేజ్ పై జూనియర్ ఎన్టీఆర్ కన్నేశాడు. తన మాస్ హీరో ఇమేజ్ నుండి బయటకు వచ్చి అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారడానికి జూనియర్ చేస్తున్న ప్రయత్నానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారి  ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

ప్రతి సినిమాకి గెటప్ మార్చే జూనియర్, ఈసారి ఎవరూ ఊహించని విధంగా తన గెటప్ ను మార్చుకుని సుకుమార్ సినిమాలో కనిపించబోతు ఉండటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘టెంపర్‌’ లో సిక్స్ ప్యాక్‌తో కనిపించిన ఎన్టీఆర్ ఈసారి 'వి షేప్' గెడ్డంతో కొత్త హెయిర్ లుక్ తో 'జేమ్స్ బాండ్' లా మారి లండన్ పట్టణాన్ని షేక్ చేస్తున్నాడు. 

తండ్రీకొడుకుల ప్రేమానురాగాలకు సంబంధించిన ఒక ఫాదర్ సెంటిమెంట్ కథతో సుకుమార్ తీస్తున్న ఈ సినిమాకు ‘మానాన్నకు ప్రేమతో’ అన్న టైటిల్ తాత్కలికంగా ఫిక్స్ చేసారు. అయితే జూనియర్ సినిమాకు ఇంత సాఫ్ట్ టైటిల్ పెట్టడమా? అంటూ కొన్ని విమర్శలు కూడ వినపడుతున్నాయి. టైటిల్ ఎలా ఉన్నా లుక్ మాత్రం అదరగోడుతూ జూనియర్ మరోసారి తన అభిమానుల పై దండయాత్రను చేయడానికి సిద్ధపడుతున్నాడు. 

సెప్టెంబర్ 20 వరకు లండన్ లోనే ఉండబోతున్న జూనియర్ ఈ సినిమా షూటింగ్ ను స్పీడ్ గా పూర్తి చేసుకుని సంక్రాంతి రేస్ లో నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ పోటీగా అమ్మాయిలకు మరో డార్లింగ్ వచ్చాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: