ప్రస్తతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ బాహుబలి. ఇదిలా ఉంటే బాహుబలి మూవీకి సంబంధించిన స్టోరి కొంత మేరకు తెలిసిన, బాహుబలి థియోట్రికల్ ట్రైలర్స్ లోనూ చూపించిందే, చూపింవి పదే పదే ఆ విజువల్స్ నే ప్రేక్షకుల మధిలో రాజమౌళి రిజిస్టర్ చేస్తున్నాడు.

తాజాగా రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ లోనూ ఇదే విషయం జరిగింది. అంతే కాకుండా చాలా తెలివిగా బాహుబలి కొత్త ట్రైలర్ లో వెస్ట్రన్ ట్రాక్ ని వాడి, మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూసుకున్నాడు. ఒకవేళ కొత్త ట్రైలర్ లో మరికొన్ని డైలాగ్స్ ని రిలీజ్ చేస్తే, బాహుబలి మూవీ ప్రేక్షకుల మదిలో పీక్స్ చేరుకుంటుంది.

ప్రేక్షకులు ఎప్పుడైతే ఏదేనా మూవీ గురింది భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తారో, ఆ తరహా మూవీలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్సాపీస్ వద్ద బోల్తాపడిన సందర్భాలే ఎక్కువుగా ఉన్నాయి. ఇవన్ని తెలుసుకున్న రాజమౌళి, బాహుబలి మూవీకి నష్టం వాటిల్లకుండా ప్రేక్షకులతో, పబ్లిసిటి పేరును వాడుకుంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు.

ఇక బాహుబలికి సంబంధించిన మరిన్న వివరాల్లోకి వెళితే, దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటికే జోరుగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున జూలై 10న విడుదల కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: