సినిమాల్లో పవర్ స్టార్‌గా అశేష అభిమానాన్ని పొందుతున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల తరపున పోరాడటమే తమ ఎజెండా అని చెబుతూ గత ఎన్నికల సమయంలో ‘జనసేన’ పేరుతో పవన్ ఓ రాజకీయ పార్టీని నెలకొల్పారు.

ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చిన పవన్, ఆ క్రమంలో పలుమార్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు సైతం గుప్పించారు. అయితే తాజా రాజకీయ పరిణామాలపై పవన్ రెండు ప్రభుత్వాలను తన స్టైల్లో ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ కి రెండు రాష్ట్రాలలోని మంత్రులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది.  

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గబ్బర్ సింగ్ 2 రిలీజ్ సమయంలో ఇరుకున పడే అవకాశం ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్ సింగ్2 దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకోబోతుంది. ఫవన్ కళ్యాణ్ ఒక్కోసారి తెలుగుదేశం ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ పై సమయం వచ్చినప్పుడు చూద్ధాంలే అన్న ధోరణితో టిడిపి ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ గబ్బర్ సింగ్2 రిలీజ్ సమయంలో, ఆ మూవీపై నెగిటివ్ ప్రచారాన్ని, అలాగే పబ్లిసిటి పరంగా డామేజ్ చేసే పనిగా కొందరు ఇప్పటి నుండి ప్లానింగ్స్ వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో గబ్బర్ సింగ్ 2 మూవీ రెండు రాష్ట్రాల్లోనే రిలీజ్ కి సంబంధించిన ఇబ్బందులు, అలాగే పబ్లిసిటికి సంబంధించిన నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: