ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒకే టాక్ ‘బాహుబలి’ ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ సినిమాకు రాని హైక్ ఈ సినిమాకు వచ్చింది. ఇక బాహుబలి ప్రభాస్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సినిమా విడుదలై దానిపై జనాల ఒపీనియన్ తెలుసుకునే వరకు నిద్ర పట్టడం లేదట ఈ విషయం స్వయంతా ప్రభాసే తెలిపాడు. ఇక ఈ ఆజానుభాహుడికి అమ్మాయిల విషయంలో డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయట. ఈ మద్య ఓ పత్రికకు ఇంటర్యూ ఇచ్చాడు ప్రభాస్ అందులో తన మనసులో భావాలు పంచుకున్నాడు.

తల్లి శివకుమారితో ప్రభాస్


ఈ సందర్భంగా అమ్మాయిల గురించి మాట్లాడుతూ తనంటే చాలా మంది అమ్మాయిలకు ఇష్టమని తెలుసు కానీ ఎందుకు ఇష్టపడుతున్నారో అన్న విషయం మాత్రం తెలియదు అంటున్నాడు ప్రభాస్. అంతే కాదు అమ్మాయి విషయంలో తన అభిప్రాయం రెండేళ్ల కోసారి మారిపోతుందని అలాగే గబ గబా మాట్లాడుతూ చలాకీగా ఉండే అమ్మాయిలంటే తనకు ఇష్టమని అన్నాడు. రెండేళ్లకోసారి అమ్మాయిల విషయంలో అభిప్రాయాలు మార్చుకుంటే చాల కష్టమని తన పెదనాన్న కృష్ణంరాజు ఈ మధ్యనే గట్టి క్లాస్ పీకారని నవ్వుతూ చెప్పాడు ప్రభాస్.  

కృష్ణం రాజు కూతుళ్లు, ఫ్రెండ్స్ తో ప్రభాస్


ఇక పెళ్లి విషయం ప్రస్తావిస్తే.. నా పెళ్లి విషయంలో చాలా రూమర్లు వస్తున్నాయి కానీ పెళ్లి విషయం పెదనాన్నే చూసుకుంటున్నారు. అది జరిగే టైమ్ లోనే జరిగిపోతుంది అన్నారు ప్రభాస్. ఇక ‘బాహుబలి’ సినిమాను తన కష్టాలలో వెన్నంటి ఉండి తనను ప్రోత్సహించిన తన తల్లికి అక్కకు బహుమతిగా ఇస్తున్నానని అన్నాడు ప్రభాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: